OPPO Pad 3: కొత్త ట్యాబ్లెట్ కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే?
OPPO Pad 3: OPPO సరసమైన టాబ్లెట్ మోడ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అదే OPPO Pad 3.
OPPO Pad 3: మీరు సరసమైన ధరలో బలమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే కొన్ని రోజులు వేచి ఉండండి. ఒప్పో సరసమైన టాబ్లెట్ మోడ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అదే OPPO Pad 3. గత నెలలో కంపెనీ ఒప్పో ప్యాడ్ 3 ప్రోని చైనాలో దాని టాప్ ఎండ్ టాబ్లెట్‌గా విడుదల చేస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రో చిప్‌సెట్, 16 జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ తన సరసమైన వెర్షన్ అంటే OPPO Pad 3ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే ట్యాబ్‌లో ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
OPPO Pad 3 Features
Oppo Pad 3 11.6-అంగుళాల 2.8K LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అలానే 144Hz రిఫ్రెష్ రేట్, టాబ్లెట్ డైమెన్సిటీ 9000 నుండి డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌కి మారుతుందని భావిస్తున్నారు, ఇది ఫ్లాగ్‌షిప్ చిప్ వలె పవర్ ఫుల్ కాదు. రాబోయే Oppo Reno 13 Pro కూడా అదే చిప్‌ని ఉపయోగిస్తుందని చెబుతున్నారు.
ఇది 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9510mAh బ్యాటరీకి సపోర్ట్ ఇస్తుంది. దీని బరువు 533 గ్రాములు. ఇది OPPO ప్యాడ్ 2 కంటే 19 గ్రాములు తేలికగా ఉంటుంది. 6.54mm మందంతో పోలిస్తే కేవలం 6.29mm మందంగా ఉంటుంది.
ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ 15, క్వాడ్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ ఫీచర్‌ల ఆధారంగా కలర్‌ఓఎస్ 15తో రన్ అవుతుంది. ఇది కీబోర్డ్, స్టైలస్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. రాబోయే రోజుల్లో కెమెరా స్పెక్స్, ర్యామ్, స్టోరేజ్ వివరాల వంటి మరింత సమాచారం బయలకు వచ్చే అవకాశం ఉంది. Oppo Pad 3 ఈ నవంబర్ తర్వాత చైనాలో Oppo Reno 13 సిరీస్‌తో పాటుగా విడుదల అవచ్చని భావిస్తున్నారు. దాని లాంచ్ తేదీ నవంబర్ 25.