Samsung Galaxy S23 FE: అమెజాన్ కళ్లు చెదిరే డీల్.. సామ్‌సంగ్ రూ.80 వేల ఫోన్ సగం ధరకే

Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ Samsung Galaxy S23 FE‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-11-13 08:30 GMT

Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ Samsung Galaxy S23 FE‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇది పవర్ ప్యాక్ట్ స్మార్ట్‌ఫోన్. మీరు తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్ ఫీచర్ల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ డీల్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 35,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఫోన్ ఆఫర్లు, ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. 

Samsung Galaxy S23 FE Offer

ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది అక్టోబర్‌లో రూ. 79,999కి విడుదల చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ. 34,999కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఫోన్‌పై రూ.1750 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఫోన్ ధర రూ.33,249కి చేరుకుంటుంది. ఇది కాకుండా అమెజాన్ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ. 21,650 వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

Samsung Galaxy S23 FE Specifications

ఈ డీల్‌లో మీరు 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌ను పొందుతారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.4-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ Exynos 2200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది వినియోగదారులకు "లైవ్ ట్రాన్స్‌లేట్", "సర్కిల్ టు సెర్చ్", "ఫోటో అసిస్ట్", "చాట్ అసిస్ట్" వంటి ఫీచర్లను అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే ఇది ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.8తో 50MP మెయిన్ కెమెరా, f/2.2తో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, OIS సపోర్ట్‌తో 8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది f/2.4తో 3X ఆప్టికల్ జూమ్‌ను కూడా అందిస్తుంది. ముందు కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 10MP సెల్ఫీ షూటర్ ఉంది. “నైటోగ్రఫీ” మోడ్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తక్కువ వెలుతురులో కూడా స్థిరమైన, మృదువైన వీడియోలను క్యాప్చర్ చేయచ్చు.

S23 FE 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది ముందు, వెనుక రెండింటిలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.

Tags:    

Similar News