Ola Own Maps: త్వరలో గూగుల్ మ్యాప్స్‌కి పోటీగా ఓలా మ్యాప్.. సొంత నావిగేషన్ మ్యాప్ సిస్టమ్..!
Ola Own Maps: భారతదేశంలో గూగుల్ మ్యాప్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
Ola Own Maps: భారతదేశంలో గూగుల్ మ్యాప్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఇది ఉంటుంది. ఇది ప్రతి సందర్భంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ సర్వీసుకు పోటీగా ఏ ఇతర యాప్ నిలబడలేదు. అయితే ఇప్పుడు పోటీగా ప్రసిద్ధ క్యాబ్ ప్రొవైడర్ కంపెనీ ఓలా సొంత మ్యాప్‌ని తయారుచేస్తోంది. సొంత నావిగేషన్ మ్యాప్ సిస్టమ్ ద్వారా భవిష్యత్తులో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ఇప్పటి వరకు మార్కెట్‌లో నావిగేషన్‌ను అందించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే వీటిలో గూగుల్ మ్యాప్స్ అగ్రభాగంలో ఉంది. ఇది మీ లొకేషన్‌ను తెలియజేయడమే కాకుండా గమ్యాన్ని చేరుకోవడానికి వేగవంతమైన మార్గాన్ని తెలియజేస్తుంది. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ పంపుల సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్ కారణంగా కస్టమర్‌లు గమ్యస్థానాన్ని సులభంగా చేరుకుంటున్నారు. కానీ ఓలా దాని కంటే వేగంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఈ నావిగేషన్ సిస్టమ్‌ను త్వరలో ప్రారంభవుతుందని కంపెనీ CEO భవేష్ అగర్వాల్ ప్రకటించారు. త్వరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఓలా క్యాబ్ (Ola Cabs)లతో సహా ఇతర ఓలా ప్రొడక్టుల్లో నావిగేషన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ప్రారంభమైతే గూగుల్‌కి గట్టిపోటీ ఉంటుందని అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ MapMyIndia అందించే డేటా ఆధారంగా నావిగేషన్‌ను అందిస్తోంది.