BSNL: త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 4G సేవలు.. జియో, ఎయిర్‌టెల్‌కి పోటీ తప్పదు..!
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో దేశంలో 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతోంది.
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో దేశంలో 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో నడుస్తుంది. ఇంతకు ముందు BSNL 4Gని లాంచ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఈసారి జనవరిలో 4Gని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత 5G సేవను ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది.
భారత ప్రభుత్వం ప్రతిదీ వేగంగా మాత్రమే కాకుండా సరైన మార్గంలో జరిగేలా చూస్తోంది. BSNL 4G వలకల వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది. ఇది అందరికీ మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. దేశంలో 4Gని ప్రారంభించడానికి BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహాయం తీసుకుంటోంది. BSNL 4G రోల్ అవుట్ ప్రాజెక్ట్ కోసం TCS ఏకైక బిడ్డర్. రాబోయే 10 సంవత్సరాల పాటు BSNL కోసం నెట్‌వర్క్‌ను నిర్వహించాలి.
BSNL 5G సేవలు
BSNL 4G తర్వాత త్వరలో 5Gని కూడా ప్రారంభిస్తుంది. ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022లో C-DoT ఇప్పటికే స్వదేశీ 5G కోర్‌ని ప్రదర్శించింది. BSNL వేగంగా 5Gని ప్రారంభించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. BSNL 2023లో 5Gని లాంచ్ చేస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చాలాసార్లు చెప్పారు. BSNL 5G ఆగష్టు 15, 2023 న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.