ESim Process: ఫోన్ చేయడానికి ఇప్పుడు సిమ్ అవసరం లేదు.. ఈ సిమ్‌ని యాక్టివేట్ చేస్తే చాలు..!
Jio ESim Proses: భారతదేశంలో eSIMని ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
Jio ESim Proses: భారతదేశంలో eSIMని ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. భౌతిక SIM కార్డ్‌తో పోల్చితే eSIMకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫోన్‌లో eSIM యాక్టివేట్ అయితే భౌతిక SIM అవసరం లేదు. ఇండియాలోని మూడు టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు భౌతిక సిమ్‌ను eSIM గా మార్చడానికి అనుమతి ఇస్తున్నాయి. అయితే వినియోగదారులు eSIMకి సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ కలిగి ఉండాలని గుర్తుంచుకోండి.
eSIMని స్మార్ట్‌ఫోన్‌కి డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫిజికల్ సిమ్‌ను వదిలించుకోవాలంటే ముందుగా దానిని E-SIMగా మార్చాలి. ఫిజికల్ సిమ్‌ను ఇ-సిమ్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. జియో యూజర్ అయితే మీ సిమ్‌ని ఈ పద్దతి ద్వార ఈ-సిమ్‌గా మార్చుకోండి.
eSIM యాక్టివేట్ పద్దతి
మీరు జియో సిమ్‌ను ఈ-సిమ్‌గా మార్చాలంటే ముందుగా మీ ఫోన్ జియో ఈ సిమ్‌కి సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేయాలి. జియో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. తర్వాత ఫోన్‌లోని సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లి ఈఎంఐ, ఈఐడీ నంబర్‌లను తనిఖీ చేసే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
యాక్టివ్ జియో సిమ్ వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరం నుంచి GET ESIM 32 అంకెల EID, 15 అంకెల IMEIని 199కి SMS పంపాలి. తర్వాత మీరు 19 అంకెల eSIM నంబర్, eSIM ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలను పొందుతారు. తర్వాత మళ్లీ 199కి SMS పంపాలి. ఇందులో మీరు SIMCHG 19 అంకెల eSIM నంబర్‌ని రాసి పంపాలి.
దీన్ని ప్రాసెస్ చేసిన 2 గంటల తర్వాత eSIM అప్‌డేట్ అవుతుంది. మెస్సేజ్ వచ్చిన తర్వాత 183 నంబర్‌కు '1'ని నిర్ధారించాలి. తర్వాత మీ జియో నంబర్‌కు కాల్ వస్తుంది. మీరు 19 అంకెల eSIM నంబర్‌ను షేర్ చేయమని మీ eSIM నంబర్‌ను షేర్ చేయమని అడుగుతారు. దీని తర్వాత మీరు కొత్త eSIM నెంబర్ మెస్సేజ్ పొందుతారు.