Portable Fan: చిన్నగా ఉందని ఛీప్‌గా తీసిపారేయకండి.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే చలికి వణికిపోవాల్సిందే.. రూ.800లలోపే ఇంటికి తెచ్చుకోండి..!
Portable Fan: ఎండ వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో జనమంతా ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు.
Portable Fan: ఎండ వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో జనమంతా ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, వీటి ఖరీదు ఎక్కువగా ఉండడంతో.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనలేకపోతున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి వేడిని అధిగమించడానికి ఉత్తమమైనవిగా పరిగణిస్తుంటారు. అయితే, ప్రస్తుతం వీటి స్థానంలో పర్సనల్ వాడకం కోసం పోర్టబుల్ ఫ్యాన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఇంట్లోనే కాదండోయ్.. జర్నీలోనూ, ఆఫీసులోనూ ఎంచక్కా వాడుకోవచ్చు. వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంది. దీంతో వ్యక్తిగత వాడకం కోసం జనాలంతా వీటిని కొంటున్నారు. అయితే, వీటికి విద్యుత్తు కూడా అవసరం లేదు. కేవలం యూఎస్‌బీతో రీ ఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని అందిస్తాయి. ఈ రంగురంగుల మినీ ఫ్యాన్ మన చుట్టూ ఉన్న గాలిని చల్లరుస్తుంది. రాత్రికి మంచి నిద్రను, పగటిపూట ఎండలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది.
ఈక్రమంలో వచ్చిందే సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్. వేడిని ఎదుర్కోవడానికి అద్భుతమైన పరిష్కారం. ఇది ప్యాకెట్‌లోనూ తీసుకెళ్లొచ్చు. USB ద్వారా రీఛార్జ్ చేయగల పోర్టబుల్ ఫ్యాన్. ఎండాకాలం వేడిమిలో బయటకు వెళ్ళాల్సి వస్తే ఈ ఫ్యాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందులో 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. దీంతో మీకు గాలి ఎంతవేగంగా కావాలో డిసైడ్ చేసుకోవచ్చు.
ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ (Built-in battery) ఉంది. చార్జింగ్ చేసిన తర్వాత నిరాటంకంగా వాడుకోవచ్చు.
చిన్నదిగా కనిపిస్తుంది. కంపాక్ట్ డిజైన్ (compact design) కలిగి ఉండటం వల్ల ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది.
ఎక్కడ దొరుకుతుంది?
ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్ లభిస్తుంది.
ధర ఎంత?
ఇండియాలో సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్ ధర రూ. 2099లుగా ఉంది. కానీ, 61 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫ్యాన్‌ను కేవలం రూ. 798లకు ఇంటికి తెచ్చుకోవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.