Samsung Galaxy M05: రూటు మార్చిన సామ్‌సంగ్.. రూ.7,999కే కొత్త ఫోన్.. ఇలాంటి ఫీచర్లు ఊహించలేదు..!

Samsung Galaxy M05: సామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎమ్05ని లాంచ్ చేసింది. రూ.7,999తో అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-13 08:20 GMT

Samsung Galaxy M05

Samsung Galaxy M05: గత రెండు దశాబ్దాలుగా సామ్‌సంగ్ మొబైల్స్ భారత్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఫీచర్ ఫోన్లు, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు ఏ సెగ్మెంట్ అయినా ఈ బ్రాండ్‌కు తిరుగులేకుంగా పోయింది. కంపెనీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫోన్లను విడుదల చేస్తుంది. అయితే గత కొంతకాలంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ పట్టు బలహీనపడింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్-1 మొబైల్ ఫోన్ బ్రాండ్‌గా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. సామ్‌సంగ్ మార్కెట్ షేర్‌లో చైనా కంపెనీలు దూసుకుపోయాయి. ఈ క్రమంలో కంపెనీ బడ్జెట్ ధరలో ధృడమైన ఫోన్‌ను విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M05 Price
సామ్‌సంగ్ ఈ ఫోన్ Galaxy M సిరీస్‌లో అందుబాటులోకి వచ్చిది. 50MP కెమెరా, 5000mAh పవర్ ఫుల్ బ్యాటరీ వంటి బలమైన ఫీచర్లను కలిగి ఉన్న Galaxy M05 పేరుతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Samsung Galaxy M05 భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే కొనగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.7,999. దీనిని మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో సేల్‌కి తీసుకొచ్చింది. అలానే ఈ ఫోన్ కంపెనీ అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M05 Features
సామ్‌సంగ్ ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. కంపెనీ ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను అందించింది. ఈ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనితో ఇది 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌‌కి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్ 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6.0లో రన్ అవుతుంది.

సామ్‌సంగ్ Galaxy M05 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50MP మెయిన్ ఫేస్ కెమెరా ఉంది. దానిలో 2MP డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి ఫీచర్లతో వస్తుంది. 5000mAh బ్యాటరీతో 25W USB టైప్ C వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Tags:    

Similar News