Samsung m62: ఆ సూపర్ ఫీచర్‌తో త్వరలో గెలాక్సీ ఎం62 లాంచ్.. !

Samsung m62: ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఎం62 ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ బీఐఎస్ వెబ్ సైట్లో దర్శనమిచ్చింది.

Update: 2021-03-22 13:15 GMT

శాంసంగ్ గెలాక్సీ ఎం62 (ఫొటో ట్విట్టర్)

Samsung m62: ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఎం62 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈమేరకు ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్ సైట్లో దర్శనమిచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ SM-M626B/DS మోడల్ నంబర్‌తో బీఐఎస్ సైట్ లో కనిపించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం62 ను ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో రిలీజ్ చేసింది శాంసంగ్. అందులో ఎక్సినోస్ 9825 4జీ ప్రాసెసర్‌ను అందించారు. గెలాక్సీ ఎం62 5జీతో రానుంది. అయితే ఇండియాలో రిలీజ్ కాబోయే స్మార్ట్ ఫోన్‌లో వేరే ప్రాసెసర్‌ను అందించనున్నారని సమాచారం. ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం62 థాయ్‌ల్యాండ్ వెర్షన్ స్పెసిఫికేషన్లు

ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇది రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం62 ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ రానున్న ఈఫోన్ మందం 0.95 సెంటీమీటర్లు కాగా, బరువు 218 గ్రాములుగా ఉంది.

Tags:    

Similar News