Reliance Jio: రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్.. సులభంగా VIP నంబర్ పొందవచ్చు..!

Reliance Jio: కొంతమంది వ్యక్తులు నలుగురికి భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

Update: 2023-08-08 09:30 GMT

Reliance Jio: రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్.. సులభంగా VIP నంబర్ పొందవచ్చు..!

Reliance Jio: కొంతమంది వ్యక్తులు నలుగురికి భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు వీఐపీ నెంబర్ల కోసం లక్షలు ఖర్చు పెట్టినట్లు తరచుగా వార్తలు వింటుంటాం. ఇలాంటి వారు ఫోన్ నంబర్ కొద్దిగా భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. వారి అదృష్ట సంఖ్య, పుట్టిన తేదీ, బండి నెంబర్‌ అయి ఉండాలని భావిస్తారు. దీంతో VIP నంబర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటి వారికి రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ని అందిస్తోంది. కావాల్సిన నెంబర్లని అందిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

టెలికాం పరిశ్రమలో రిలయన్స్ జియో నెంబర్ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. కస్టమర్ల కోసం ప్రతిరోజు కొత్త కొత్త ఆఫర్లని ప్రవేశపెడుతూ ఆకర్షిస్తుంది. అయితే Jio VIP నంబర్‌ని సులభమైన ప్రక్రియ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం jio.com వెళ్లి సులభమైన ప్రక్రియను అనుసరించాలి. ఇందులో కస్టమర్‌లు అనేక నంబర్‌లను చూస్తారు. అవి VIP కేటగిరీ జాబితాలో ఉంటాయి. వీటిలో నచ్చిన నంబర్‌ను తీసుకోవచ్చు. పూర్తి ప్రక్రియ గురించి చూద్దాం.

VIP నంబర్‌ను ఎలా పొందాలి..?

Jio VIP నంబర్‌ని తీసుకునే ముందు www.jio.comకి వెళ్లాలి. తర్వాత www.jio.com/selfcare/choice-number/ సందర్శించాలి. తర్వాత నేరుగా Jio VIP నంబర్‌ను పొందే ప్రక్రియకు వెళతారు. బుక్ ఎ చాయిస్ నంబర్ కింద ఉన్న బాక్స్‌లో ప్రస్తుత నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి. తర్వాత కావలసిన VIP నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఈ ప్రక్రియలో మరింత ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని మొబైల్ నంబర్లని గమనిస్తారు. వాటిపై క్లిక్ చేయడం వల్ల కొనుగోలు చేయవచ్చు. నంబర్‌ను ఎంచుకున్న తర్వాత చెల్లింపు చేయాలి. దీనికి కస్టమర్ రూ.499 చెల్లించవలసి ఉంటుంది.

Tags:    

Similar News