Jio: జియో ఆకర్షణీయమైన ప్లాన్స్.. లో కాస్ట్‌లో లాంగ్ లైఫ్ వాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్!

Jio prepaid recharge plans: జియో (Jio) తన సబ్‌స్క్రైబర్‌ల కోసం బడ్జెట్ ధరలలో కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను (Recharge Plans) కూడా అందించింది.

Update: 2024-10-07 01:30 GMT

Jio Prepaid Recharge Plans

Jio: రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్‌లతో భారత టెలికాం రంగంలో సందడి చేసింది. వాటిలో జియో (Jio) చాలా ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (Voice calling), డైలీ డేటా (Daily Data) అందిస్తాయి. జియో తన సబ్‌స్క్రైబర్‌ల కోసం బడ్జెట్ ధరలలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను (Prepaid Recharge Plans) కూడా అందించింది. అందులో జియో టెలికాం రూ.479. రీఛార్జ్ ప్లాన్ (479 recharge plan) సుమారు మూడు నెలల వాలిడిటీని ఇస్తుంది. జియో నుండి రూ. 479. రీఛార్జ్ ప్లాన్ (Recharge Plans) మొత్తం 84 రోజుల వాలిడిటీతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్స్ (Prepaid Plan Data Benefits), అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్‌తో కూడా వస్తుంది. దీనికి తోడు ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉండటం ప్లస్ పాయింట్. కాబట్టి జియో రూ. 479 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాం.

జియో రూ. 479 రీఛార్జ్ ప్లాన్ (Jio Rs. 479 prepaid recharge plan)

జియో ఈ రూ. 479. రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 84 రోజుల వాలిడిటీని పొందుతారు. అలాగే పూర్తి వ్యాలిడిటీ వ్యవధిలో మొత్తం 6GB డేటా ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు మొత్తం 1000 SMSలు కూడా అందుబాటులో ఉన్నాయి. అ ఈ రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ని అందిస్తోంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 6GB డేటా వస్తుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. అలాగే మొత్తం 1000 SMSలు అందుబాటులో ఉన్నాయి.దీనికి కూడా డైలీ లిమిట్ లేదు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

జియో 1889 రూ. రీఛార్జ్ ప్లాన్ (Jio Rs. 1889 prepaid recharge plan)

ఈ రూ. 1889 =ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లకు మొత్తం 336 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంటాయి. అలాగే పూర్తి వ్యాలిడిటీలో మొత్తం 24GB డేటా ఉంటుంది. దీనితో పాటు కస్టమర్‌లు మొత్తం 3600 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది కాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తోంది.

జియో 189 రూ. రీఛార్జ్ ప్లాన్ (Jio Rs. 189 prepaid recharge plan)

జియో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో మొత్తం 28 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. అలాగే వ్యాలిడిటీలో మొత్తం 2GB డేటా లభిస్తుంది. దీనితో పాటు కస్టమర్‌లు మొత్తం 3600 SMSల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. కాబట్టి 28 రోజుల వాలిడిటీకి 2GB డేటా ఉంది. రోజువారీ డేటా పరిమితి లేదు. అలాగే మొత్తం 300 SMSలు లభిస్తాయి. దీనితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News