Reliance: కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ.. జియో 5జీ వచ్చేస్తోంది..
Reliance AGM 2021: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు.
Reliance AGM 2021: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. జూన్ 24వ తేదీన జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ ఏజీఎంలో ముఖేష్ మాట్లాడారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో తమ కంపెనీ ఉద్యోగులు ఎంతో గొప్పగా పని చేశారని, ఉద్యోగుల పనితీరు వల్ల అంచనాలకు మించి లాభాలు వచ్చాయని అన్నారు. వినియోగదారుల ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలో జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని ముకేష్ అంబానీ ప్రకటించారు. 100 శాతం ఇండియాలోనే తయారైన జియో 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని ప్రకటించారు. ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతం అందుకున్నట్టు ప్రకటించారు. జియో 5జీ నెట్వర్క్ లాంఛ్ చేసేందుకు రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయని, 5జీ ఫీల్డ్ ట్రయల్స్ కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఇండియాలో తామే మొదట 5జీ నెట్వర్క్ లాంఛ్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో కూడా 5జీ ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు విద్యారంగంలో కూడా 5జీ సేవల్ని అందిస్తామన్నారు.
గూగుల్‌తో కలిసి జియో ట్రూలీ బ్రేక్ థ్రూ స్మార్ట్‌ఫోన్ 'జియో ఫోన్ నెక్స్ట్'ను అభివృద్ధి చేసినట్టు చెప్పడానికి సంతోషిస్తున్నట్టు ముకేష్ అంబానీ చెప్పారు. ఇది పూర్తిగా ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్ అనీ, గూగుల్, జియో అప్లికేషన్లు అన్నీ ఈ ఫోన్‌లో ఉంటాయని చెప్పారు. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందన్నారు. సెప్టెంబరు 10న వినాయక చవితిని పురస్కరించుకుని మార్కెట్లో విడుదల చేయనున్నట్టు అంబానీ వివరించారు.