Redmi: రెడ్‌మి నుంచి మరొక స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఊహించని ఫీచర్లు సరసమైన ధరలో..!

Redmi: షియోమికి అనుబంధంగా ఉన్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌ మీ నోట్ 13ఆర్ ప్రోను విడుదల చేయనుంది.

Update: 2023-11-18 15:00 GMT

Redmi: రెడ్‌మి నుంచి మరొక స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఊహించని ఫీచర్లు సరసమైన ధరలో..!

Redmi: షియోమికి అనుబంధంగా ఉన్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌ మీ నోట్ 13ఆర్ ప్రోను విడుదల చేయనుంది. ఈ ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ చైనా టెలికాం నుంచి వచ్చిన జాబితా ప్రకారం ఈ ఫోన్ నవంబర్ 20 న చైనాలో లాంచ్ అవుతుందని వెల్లడించింది. అంతేకాకుండా ఈ లిస్టింగ్‌లో ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు, చిత్రాలు వెల్లడయ్యాయి.

Redmi Note 13R ప్రో స్పెక్స్

చైనా టెలికాం జాబితా ప్రకారం.. Redmi Note 13R Pro 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది పూర్తి HD+ రిజల్యూషన్ (1080 x 2400 పిక్సెల్‌లు), 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. బ్యాక్‌ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ ఆక్సిలరీ లెన్స్ ఉంటాయి.

Redmi Note 13R ప్రాసెసర్

Redmi Note 13R ప్రోలో MediaTek MT6833P చిప్‌సెట్ ఉంటుంది. ఇది డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌గా కనిపిస్తుంది. పరికరం 12GB RAM, 256 GB స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. నోట్ 13ఆర్ ప్రోలో అదనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది.

Redmi Note 13R ప్రో బ్యాటరీ

Redmi Note 13R Pro 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని 3C సర్టిఫికేషన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుందని ఇప్పటికే వెల్లడించింది. ఈ పరికరం MIUI 14-ఆధారిత ఆండ్రాయిడ్ 13, సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది. దీని కొలత 161.11 x 74.95 x 7.73 మిమీ, దాని బరువు 174.3 గ్రాములు ఉంటుంది.

Redmi Note 13R Pro ధర

చైనా టెలికాం లిస్టింగ్ ప్రకారం Redmi Note 13R ప్రో ధర 1,999 యువాన్లు (సుమారు రూ.23 వేలు). ఇది 12GB + 256 GB కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం మిడ్‌నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ వంటి రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

Tags:    

Similar News