Redmi 14C 5G: భలే మంచి చౌక బేరం.. రూ.9,999లకే కొత్త 5జీ ఫోన్, ఫీచర్లు మాత్రం తోపు బ్రదర్!

Redmi 14C 5G: రెడ్‌మి 14సి 5జీ మొబైల్‌ లాంచ్ చేయనుంది. దీని ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-10-01 11:11 GMT

Redmi 14C 5G

Redmi 14C 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్‌మి తన 14 సిరీస్‌లో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ గత నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది MediaTek Helio G81Ultra చిప్‌సెట్, 8GB RAM,  5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ 5G మోడల్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్‌లో సందడి చేయనుంది.

Redmi 14C 5G మొబైల్ చైనీస్ సర్టిఫికేషన్ సైట్ TENAAలో కనిపించింది. ఇందులోరాబోయే Redmi 5G ఫోన్  అనేక ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2411DRN47C. ఫోన్ ఫోటో మార్కెటింగ్ పేరు గురించిన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ మొబైల్ Redmi 14C 5G గా సేల్‌కు రానుంది. 

Redmi 14C 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 720 x 1640 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ పెద్ద డిస్‌ప్లే LCD ప్యానెల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ పొందుతుంది. సమాచారం ప్రకారం (Tena) మొబైల్ 2.36 GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ చిప్‌సెట్ పేరు ఇక్కడ వెల్లడించలేదు. అయితే ఫోన్‌లో క్వాల్‌కామ్ Snapdragon 4 Gen 2 (Qualcomm Snapdragon 4 Gen 2) ప్రాసెసర్ ఉండొచ్చు.

Redmi 14C 5G సర్టిఫికేషన్ సైట్‌లో మొత్తం నాలుగు RAM వేరియంట్‌లలో ఉంది. అందులో 4GB, 6GB, 8GB, 12GB RAM, 64GB, 128GB, 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అయితే ఈ ఫోన్ వివిధ మార్కెట్లలో వివిధ వేరియంట్లలో సేల్‌కి తీసుకురానున్నారు.  స్మార్ట్‌ఫోన్ 5,060mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఫోన్ దాని 4G వేరియంట్ లాగా 5,160mAh బ్యాటరీతో ప్రారంభించవచ్చు. ఇది 18W ఛార్జింగ్‌ని కూడా పొందే అవకాశం ఉంది.  ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  ఫోన్ వెనుక ప్యానెల్‌లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అదనంగా 0.8 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ Redmi 5G ఫోన్ 171.88 x 77.78 x 8.3 mm మందం, 212.3 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. మొబైల్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,  IR బ్లాస్టర్‌ను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. TENAA కంటే ముందు IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్ 2411DRN47I ఉన్న అదే స్మార్ట్‌ఫోన్ కూడా గుర్తించబడింది. స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో దాదాపు రూ.9,999కి విడుదల చేసింది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Tags:    

Similar News