Realme Smartphone: 108 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో 2 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. తక్కువ ధరలోనే..!

Realme 11 and Realme 11x 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ త్వరలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఆగస్టు 23న భారతదేశంలో Realme 11, Realme 11x 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ YouTube ఛానెల్ ద్వారా చూడొచ్చు.

Update: 2023-08-19 12:54 GMT

Realme Smartphone: 108 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో 2 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. తక్కువ ధరలోనే..

Realme 11 And Realme 11x 5G Launch Date: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ త్వరలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఆగస్టు 23న భారతదేశంలో Realme 11, Realme 11x 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ YouTube ఛానెల్ ద్వారా చూడొచ్చు. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ రోజున Realme Buds Air 5 Proని కూడా ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఇక్కడ, స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు, కంపెనీ దాని కొన్ని స్పెషిఫికేషన్స్‌ను పంచుకుంది.

స్పెసిఫికేషన్స్..

Realme 11xలో 64MP ప్రైమరీ కెమెరాను అందించనుంది. ఇది AIతో జతచేశారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఫోన్ రానుంది. Realme 11 5G గురించి మాట్లాడితే, ఇది 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD + డిస్‌ప్లేను పొందుతుంది. రెండు ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 6100+ SoCతో రావొచ్చు. ఫోటోగ్రఫీ కోసం, ఇది 108MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉండే డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ముందు భాగంలో 16MP కెమెరా అందుబాటులో ఉంటుంది. Realme 11 బాక్స్ 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Android 13 ఆధారిత Realme UI 4.0పై ఫోన్ పని చేస్తుంది.

కంపెనీ Realme 11 5Gని 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చు. ఇది గ్లోరీ బ్లాక్, గ్లోరీ గోల్డ్ రంగులలో అందించనుంది. మరోవైపు, Realme 11X 5G 6GB + 128GB, 8GB + 256GB కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది.

ధరలు ఎలా ఉన్నాయంటే..

Realme 11X 5Gతో పోలిస్తే, Realme 11 5G స్మార్ట్‌ఫోన్ మెరుగైన కెమెరా పనితీరును అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 20,000 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. రెండు స్మార్ట్‌ఫోన్‌లు Xiaomi, Redmi 12 సిరీస్, Samsung Galaxy M14 లతో పోటీ పడతాయని అంటున్నారు.

Tags:    

Similar News