OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. వన్‌ప్లస్ 12పై బిగ్ డిస్కౌంట్!
OnePlus Community Sale: చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ 'వన్‌ప్లస్' కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. 'వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్' 2024ను కంపెనీ ప్రకటించింది.
OnePlus Community Sale: చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ 'వన్‌ప్లస్' కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. 'వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్' 2024ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు.. 12 రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి టాప్ స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అంతేకాదు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా వన్‌ప్లస్ అందిస్తోంది. మరోవైపు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఆన్‌లైన్ స్టోర్లలలో కూడా ఈ సేల్ కొనసాగుతోంది.
కమ్యూనిటీ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 12జీబీ రామ్ + 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. రూ.6వేల డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ రూ.58,999కి మీ సొంతం అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా మరో వెయ్యి పొందవచ్చు. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. వన్‌ప్లస్ 12ఆర్‌పై రూ.6 వేలు డిస్కౌంట్ ఉండగా.. అదనంగా బ్యాంకు కార్డులపై రూ.3 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ 16జీబీ రామ్ + 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది.
కమ్యూనిటీ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. రూ.3వేలు డిస్కౌంట్, రూ.2 వేలు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్స్ అనంతరం రూ.24,999కి సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2 వేల డిస్కౌంట్, వెయ్యి రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ కంపనీ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాదు.. వన్‌ఫ్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ వాచ్2, వనఫ్లస్ బడ్స్ ప్రో 3పై బిగ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ కోసం వన్‌ప్లస్ సైట్ చెక్ చేయండి.
వన్‌ప్లస్ 12 స్పెక్స్:
# ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్‌ఓఎస్ 14
# 4,500 నిట్స్ బ్రైట్‌నెస్
# 120Hz వరకు రీఫ్రెష్ రేట్
# 6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ఓలెడ్ స్క్రీన్
# 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్
# 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
# 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ