Ola Electric Bikes: ఓలా 3 చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌లు.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Ola Electric Bikes: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది.
Ola Electric Bikes: ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు కంపెనీ వేర్వేరు ధరలలో మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురాబోతోంది. వీటికి ఓలా 'అవుట్ ఆఫ్ ది వరల్డ్', ఓలా పెర్‌ఫార్మాక్స్, ఓలా రేంజర్ అని పేరు పెట్టనున్నారు. వీటిలో ఓలా 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అత్యంత ప్రీమియం ఎంపికగా ఉంటుంది. ఇది గరిష్ట రేంజ్, గరిష్ట వేగాన్ని 100kmph వరకు పొందబోతోంది. వీటిలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్ ధర కేవలం 85 వేల రూపాయలుగా ఉండబోతోంది.
ఓలా అవుట్ ఆఫ్ ది వరల్డ్
ఓలా 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' ఫుల్ ఛార్జ్‌పై 174 కిలోమీటర్ల రేంజ్‌ను అందించబోతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకుపోగలదు. ఈ మోడల్ కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర దాదాపు రూ.1,50,000 ఉంటుంది. భద్రత కోసం ఖరీదైన కార్లలో కనిపించే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఫీచర్‌ను పొందుతుంది.
Ola Performax
Ola Performax ఒక మిడ్-రేంజ్ బైక్. మూడు వేరియంట్లలో వస్తుంది . దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ 91 కి.మీ పరిధి, 93 కి.మీ గరిష్ట వేగాన్ని పొందబోతోంది. వేరియంట్ ధర రూ.1,05,000 ఉండవచ్చు. అదే మోడల్ రెండవ వేరియంట్ 133 కిమీ పరిధి, 95 kmph గరిష్ట వేగంతో వస్తుంది. దీని ధర రూ.1,15,000 ఉండవచ్చు. దీని టాప్ వేరియంట్ ధర రూ.1,25,000. ఇది 174 కిమీ పరిధితో గంటకు 95 కిమీ గరిష్ట వేగాన్ని పొందవచ్చు.
ఓలా రేంజర్
ఓలా రేంజర్ అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్. దీని ధర రూ.85,000 నుంచి మొదలై రూ.1,05,000 వరకు ఉండవచ్చు. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ 80 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. గరిష్టంగా 91kmph వేగంతో నడుస్తుంది. దీని మధ్య వేరియంట్ ధర రూ.95,000. ఇది 117 కి.మీ పరిధి, 91 కి.మీ గరిష్ట వేగంతో ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 153 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 91 కిమీ.గా చెప్పవచ్చు.