Nokia G20 Mobile: నోకియా నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్లు

Nokia G20 Mobile: దిగ్గజ‌ మొబైట్ సంస్ధ నోకియా దేశీయ‌ మార్కెట్లో సత్తాచాటాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.

Update: 2021-05-13 06:56 GMT

నోకియా మొబైల్స్ (ఫైల్ ఫోటో) 

Nokia G20 Mobile: దిగ్గజ‌ మొబైట్ సంస్ధ నోకియా దేశీయ‌ మార్కెట్లో సత్తాచాటాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. మ‌ళ్లీ త‌న ఉనికిని కాపాడుకోని.. ఇత‌ర సంస్థ పొటీనివ్వాల‌ని ఆరాట‌ప‌డుతోంది. మనదేశంలో ఇప్ప‌టికే ప‌లు ర‌కాల స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. సామ్ సాంగ్ , మోటో, షియోమి, పోకో వంటి ఫోన్ల‌కు పోటీగా బ‌డ్జెట్ మొబైల్స్ త‌ర్వ‌లోనే లాంచ్ చేయ‌నుంది. జీ10, జీ20 స్మార్ట్ ఫోన్లు త్వరలో కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో రూ.15 వేలలోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

నోకియా జీ10, జీ20 స్మార్ట్ ఫోన్లు ఈ రెండు ఫోన్లూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ కూడా పొందాయి. ఈ విషయాన్ని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలిపారు. దీన్ని బట్టి ఈ రెండు ఫోన్లూ త్వరలో మనదేశంలో లాంచ్ అవుతాయని అనుకోవచ్చు. నోకియా జీ10 మొబైల్ TA-1334 మోడల్ ,నోకియా జీ20 స్మార్ట్ ఫోన్ TA-1365 మోడల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో దుర్శ‌నిమిచ్చాయి.

నోకియా జీ10 స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్

6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే

యాస్పెక్ట్ రేషియో 20:9

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌

వెనకవైపు 3 కెమెరాలు

కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్

2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్,

2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

ముందువైపు 8 మెగాపిక్సెల్

4 జీబీ వరకు ర్యామ్,

64 జీబీ వరకు స్టోరేజ్

మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా

10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్,

ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ

మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.

నోకియా జీ20 స్పెసిఫికేషన్లు

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే

యాస్పెక్ట్ రేషియో కూడా 20:9

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌

10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్

మైక్రో ఎస్‌డీ కార్డు 512 జీబీ

వెనకవైపు మూడు కెమెరాలు

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్

5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్,

2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్

ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో,

యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు

దీని మందం 0.92 సెంటీమీటర్లుగానూ, బరువు 194 గ్రాములుగానూ ఉంది.

Tags:    

Similar News