Netflix Free Games: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తగా 5 గేమ్‌లు..అదనపు ఛార్జీలు అవసరంలేదు..
Netflix Free Games: వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్తగా ఐదు మొబైల్ గేమ్‌లను ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ గత సంవత్సరం నుంచి తన ప్లాట్‌ఫారమ్‌లో గేమింగ్‌ను పరీక్షిస్తోంది. ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం ద్వారా కంపెనీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. దీనికి ఎలాంటి అదనపు చెల్లింపులు అవసరం లేదని ట్వీట్‌లో పేర్కొంది. అలాగే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా ఈ గేమ్స్ ఆడవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ మొదటి ఐదు మొబైల్ గేమ్‌ల పేర్లు కింది విధంగా ఉన్నాయి. 1. స్ట్రేంజర్ థింగ్స్, 1984 (BonusXP), 2. స్ట్రేంజర్ థింగ్స్ 3. ది గేమ్ (BonusXP), 3. షూటింగ్ హోప్స్ (ఫ్రాస్టీ పాప్), 4. కార్డ్ బ్లాస్ట్ (అముజో & రోగ్ గేమ్‌లు) ఐదవది టీటర్ అప్ (Frosty Pop).
ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే
నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సర్వీస్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. కొన్ని గేమ్‌లు ఆన్‌లైన్‌లో, కొన్ని ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. అయితే కిడ్స్ ప్రొఫైల్ కోసం Netflix గేమింగ్ సర్వీస్ అందుబాటులో లేదు.
అయితే పిల్లలను గేమింగ్ నుంచి దూరంగా ఉంచడానికి మీరు సెక్యూరిటీ పిన్‌ను ఉపయోగించవచ్చు. గేమింగ్ కోసం కంపెనీ BonusXP, Los Gatos వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కాకుండా నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే వీడియో గేమ్ సృష్టికర్తలు నైట్ స్కూల్ స్టూడియోలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అదనపు ఖర్చు లేదు
గేమ్ కోసం కస్టమర్‌లకు అదనపు ఛార్జీలు ఏమిలేవు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు. నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సమయంలో ఏ యూజర్‌కు ఎలాంటి ప్కటన కనిపించదని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ సర్వీస్‌తో భాషపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి వినియోగదారులు హిందీ, బంగ్లా, పంజాబీ, మరాఠీ వంటి భాషల్లో కూడా గేమింగ్‌ను ఆస్వాదించగలరు. మీరు భాషను ఎంచుకోకపోతే గేమ్ డిఫాల్ట్ భాష ఇంగ్లీష్ అవుతుంది.
Netflix యాప్‌లో మీరు కొత్త ట్యాబ్‌ని చూస్తారు అందులో గేమింగ్‌గా ఉంటుంది. ఆ ట్యాబ్‌పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటలు కనిపిస్తాయి. గేమ్‌ను ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లో కూడా ఆడవచ్చు. అయితే ప్రస్తుతానికి iOS వినియోగదారులు మాత్రం కొంత సమయం వేచి ఉండాలి.