Motorola Razr 50s: బ్రాండ్‌కా బాప్.. మోటో నుంచి బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్.. చాలా ప్రీమియం గురూ..!

Motorola Razr 50s: మోటరోలా త్వరలో Razr 50s స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-24 09:56 GMT
Motorola Razr 50s

Motorola Razr 50s

  • whatsapp icon

Motorola Razr 50s: మోటరోలా తన Razr సిరీస్‌‌లో మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ తీసుకురానుంది. కంపెనీ ఈ రాబోయే ఫోన్ Motorola Razr 50s. ఇంతకుముందు కంపెనీ ఈ లైనప్‌లో Motorola Razr 50 Ultra. Razr 50 వంటి ఫోన్లను పరిచయం చేసింది. Motorola Razr 50s ఇటీవల గీక్‌బెంచ్‌లో గుర్తించబడింది. దానిలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను వెల్లడించింది. కాబట్టి Motorola రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం

Motorola  Razr 50
ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ " motorola razr 50"తో లిస్ట్ చేయబడింది. జాబితా ప్రకారం ఫోన్ 8GB RAM కలిగి ఉంటుంది. Android 14లో పని చేస్తుంది. ఫోన్ మదర్‌బోర్డ్ 'aito' అనే కోడ్‌నేమ్‌తో లిస్ట్ చేయబడింది. దీని కారణంగా ఇది ఇప్పటికే Motorola Razr 50లో ఉన్న MediaTek Dimensity 7300 SoC లేదా MediaTek Dimensity 7300X SoC ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గీగాబెంచ్ టెస్టింగ్‌లో Motorola Razr 50s సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,040 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 3,003 పాయింట్లు సాధించింది. అయితే Motorola Razr 50 సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,051 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 3,032 పాయింట్లు సాధించింది. అంటే Motorola Razr 50s పర్ఫామెన్స్ Razr 50 లానే ఉంటుంది.

మోటరోలా Razr 50sలో 8GB RAM, Android 14 ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ HDR10+ సర్టిఫికేషన్‌తో రావచ్చు. అంటే దీని డిస్‌ప్లే HDR10+కి సపోర్ట్ ఇస్తుంది. ఇతర స్పెక్స్ ఇంకా వెల్లడి కాలేదు, అయితే ఈ ఫోన్ Razr 50 బడ్జెట్‌ వేరియంట్ కావచ్చు.

Tags:    

Similar News