Motorola: 32MP ఫ్రంట్ కెమెరా కలిగిన మోటరోలా ఫోన్‌పై డిసెంబర్ వరకు భారీ క్యాష్ బ్యాక్
Motorola Edge 50 Fusion phone offer prices: రూ. 25 వేల బడ్జెట్లో 32 MP సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. విశేషమేమిటంటే, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ క్లోజ్ ఆఫ్ సీజన్ సేల్‌లో బంపర్ తగ్గింపుతో లభిస్తుంది. 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.24,999లకే లభిస్తుంది. ఈ డిసెంబర్ 13 వరకు జరిగే ఈ సేల్‌లో రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ తగ్గింపును పొందడానికి యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ-యేతర లావాదేవీ రూపంలో ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ రూ.23,200 తక్కువ ధరకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్ స్టేటస్, బ్రాండ్, కంపెనీ ఎక్సేంజ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఈ మోటరోలా ఫోన్‌లో 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ పోల్డ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో అందించిన ఈ డిస్‌ప్లే గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి 1600 నిట్స్. ఫోన్‌లో డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 కూడా అందించారు. ఈ మోటరోలా ఫోన్ గరిష్టంగా 12 GB RAM, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌తో పని చేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇది 13 MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50 MP మెయిన్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌లో అందించిన అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను మాక్రో కెమెరాగా ఉపయోగించవచ్చు. సెల్ఫీల కోసం ఫోన్ 32 MP ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5000mAh బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.