Moto G Stylus 5G: 5జీ ఫోన్ రిలీజ్ చేయనున్న మోటో!

Moto G Stylus 5G: మోటొరోలా ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌‌లను విడుదల చేస్తూ.. టెక్ మార్కెట్లో దూసుకపోతోంది.

Update: 2021-06-01 16:17 GMT

మోటో జీ స్టైలస్ 5జీ (ఫొటో ట్విట్టర్)

Moto G Stylus 5G: మోటొరోలా ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌‌లను విడుదల చేస్తూ.. టెక్ మార్కెట్లో దూసుకపోతోంది. తాజాగా మోటో జీ స్టైలస్ 2021 అనే స్మార్ట్ ఫోన్‌ను అమెరికాలో విడుదల చేసింది. ప్రస్తుతం మోటొరోలా మరో స్మార్ట్ ఫోన్ ను రూపొందిచనుందంట. అదే మోటో జీ స్టైలస్ 5జీ అనే ఫోన్‌.

ఈ కొత్త ఫోన్ స్పెషిఫికేషన్లు కొన్ని ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి మేరకు ఈఫోన్‌లో పంచ్ హోల్ తరహా డిస్‌ప్లే రానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫోన్ కిందభాగంలో కాస్త మందంగా ఉండనుంది. వెనకవైపు 4 కెమెరాల సెటప్ ను పిల్ ఆకారంలో అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఫోన్ వెనకభాగంలోనే అందించారంట.

అలాగే 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్, స్టైలస్ పెన్ పోర్టు అందించారంట. 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లేతో అలరించనుందంట. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 678 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందంట. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

ఈ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాల్లో... వీటిలో ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Tags:    

Similar News