Date Of Birth Certificate: డేట్‌ఆఫ్‌బర్త్‌ సర్టిఫికెట్‌ పోయిందా.. ఇలా సులువుగా డూప్లికేట్‌ పొందండి..!

Date Of Birth Certificate:ఈ రోజుల్లో డేట్‌ఆఫ్‌బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే ఏ పని జరగడం లేదు.

Update: 2024-02-19 12:30 GMT

Date Of Birth Certificate: డేట్‌ఆఫ్‌బర్త్‌ సర్టిఫికెట్‌ పోయిందా.. ఇలా సులువుగా డూప్లికేట్‌ పొందండి..!

Date Of Birth Certificate: ఈ రోజుల్లో డేట్‌ఆఫ్‌బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే ఏ పని జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, స్కూల్‌, కాలేజ్‌లో అడ్మిషన్‌ తీసుకోవడానికి ఇలా చాలావాటికి ఈ సర్టిఫికెట్‌ అవసరం అవుతుంది. కొన్నిసార్లు దీనిని ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్లీ దీని డూప్లికేట్‌ను సులువుగా పొందవచ్చు. ఆ ప్రాసెస్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ప్రక్రియ

డేట్‌ఆఫ్‌బర్త్‌ డూప్లికేట్‌ కోసం ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు అలాగే ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీ రాష్ట్రంలోని ముందుగా సివిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇందులో డేట్‌ఆఫ్‌బర్త్‌ డూప్లికేట్‌ కాపీ కోసం లింక్‌ను చూస్తారు. ఇది ఒపెన్‌ చేసి అప్లికేషన్‌ ఫారమ్‌ పూరించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ ఫీజును చెల్లించాలి. అయితే అప్లికేషన్‌ ఫీజులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత దాని స్టేటస్‌ను మీరు చెక్‌ చేయవచ్చు. డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ సాధారణంగా 15 నుంచి 30 రోజులలోపు మీ చిరునామాకు వస్తుంది.

అవసరమైన పత్రాలు

ఒక కలర్‌ పొటో

అప్లికేషన్‌ దారుడి ఆధార్ కార్డ్

అప్లికేషన్‌ దారుడి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్

డేట్‌ఆఫ్‌బర్త్‌ ఫొటో కాపీ (అందుబాటులో ఉంటే)

ఆఫ్‌లైన్ ప్రక్రియ

ఆఫ్‌లైన్ ప్రక్రియ కోసం ముందుగా మీరు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ డేట్‌ఆఫ్‌బర్త్‌ డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కోసం ఒక అప్లికేషన్‌ ఫారమ్‌ను నింపాలి. తర్వాత అవసరమైన పత్రాల జిరాక్స్‌లను అటాచ్‌ చేయాలి. అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. అయితే అప్లికేషన్‌ ఫీజులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయని గుర్తంచుకోండి. అప్లికేషన్‌ సమర్పించిన తర్వాత దాని స్టేటస్‌ చెక్‌ చేయడానికి మీరు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ సాధారణంగా 15 నుంచి 30 రోజులలోపు వస్తుంది. ఆఫ్‌లైన్‌లో కూడా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ చేసుకోవడానికి అవసరమయ్యే పత్రాలు అవసరమవుతాయి.

Tags:    

Similar News