Jio 2023 Plan: జియో కొత్త సంవత్సరం కొత్త ప్లాన్.. తక్కువ ధరలో 630GB డేటా, లాంగ్ వాలిడిటీ..!
Jio 2023 Plan: జియో కొత్త సంవత్సరం కొత్త ప్లాన్.. తక్కువ ధరలో 630GB డేటా, లాంగ్ వాలిడిటీ..!
Jio 2023 Plan: 2022 ముగియబోతోంది. ఈ పరిస్థితిలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త ఏర్పాట్లు చేసింది. జియో రూ. 2023 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీంతోపాటు తన రూ. 2999 ప్లాన్‌కి మరిన్ని ప్రయోజనాలని అందించింది. ఈ రెండు ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
రిలయన్స్ జియో 2023 ప్లాన్
రూ. 2023 జియో రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2.5 GB హై-స్పీడ్ డేటా, ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్‌తో ఎటువంటి OTT ప్రయోజనాన్ని పొందలేరు. కానీ ఈ ప్లాన్‌తో ఖచ్చితంగా కంపెనీ అందించే Jio యాప్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే 252 రోజుల వాలిడిటీ ఉంటుంది. దీని ప్రకారం రోజుకు 2.5 GB డేటా మొత్తం 630 GB డేటాను పొందుతారు.
రిలయన్స్ జియో 2999 ప్లాన్
2999 రూపాయల ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కంపెనీ పెద్ద మార్పు చేసింది. ఈ ప్లాన్‌తో రిలయన్స్ జియో వినియోగదారులకు కంపెనీ నుంచి అదనపు వాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్‌తో, 2.5 GB హై-స్పీడ్ డేటాతో పాటు ప్రతిరోజూ ఉచిత అపరిమిత కాలింగ్, 100 SMSలు అందుతాయి. కంపెనీ 75 GB బోనస్ డేటాను ఇస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్లాన్‌తో అదనపు డేటా మాత్రమే కాకుండా వినియోగదారులకు 23 రోజుల అదనపు వాలిడిటీ కూడా లభిస్తుంది.