Itel A50: రూ. 7వేలలోపు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్ ఏ50 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Itel A50: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. రూ. 10వేలలోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐటెల్ ఏ50 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్ ఏ50 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంపనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరాలు ప్రకటించకపోయినప్పటికీ.. ఐటెల్ ఏ50 ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం ఈ ఫోన్‌లో యూనిసోక్ టీ603 ఎస్వోసీ ప్రాసెసర్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 7000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే ఐటెల్ నుంచి గతేడాది మార్కెట్లోకి ఐటెల్ ఏ70 స్మార్ట్ ఫోన్ వచ్చిన విషయం తెలిసిందే. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,299గా నిర్ణయించారు. అలాగే 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,799, 4జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299కి అందుబాటులోకి తీసుకొచ్చారు.