Smartphone Running: స్మార్ట్‌ఫోన్ స్లోగా రన్ అవుతుందా.. మీరు ఈ పని చేయడం లేదని అర్థం..!
Smartphone Running: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగంగా మారింది.
Smartphone Running: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగంగా మారింది. ఇదిలేనిదే ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టడం లేదు. దీనివల్ల అన్నిపనులు సులభంగా జరుగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుంది. ఫోటోలు క్లిక్ చేయడం, ఆఫీసు మెయిల్ తనిఖీ చేయడం, చెల్లింపులు చేయడం, సోషల్ మీడియాను మెయింటెన్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రైలు టికెట్స్ బుక్ చేయడం వంటి అనేక పనులని చేస్తున్నారు. దీనివల్ల ఒక్కోసారి ఫోన్ స్లో అవుతుంది. ఈ సమయంలో ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
ప్రతిరోజు స్మార్ట్‌ఫోన్ ద్వారా చాలా పనులని చేస్తాం కాబట్టి అది సరిగ్గా పనిచేయడం అవసరం. లేదంటే చాలా పనులు ఆగిపోతాయి. ఫోన్ స్లోగా రన్ అవుతున్నప్పుడు దానిని రీస్టార్ట్ చేయాలి. దీనివల్ల ఫోన్ మెమొరీ, ప్రాసెసర్ రిఫ్రెష్ అవుతుంది. స్లో అవ్వడం హ్యాంగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్‌ని రీస్టార్ట్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి వారం ఎన్నిసార్లు రీస్టార్ట్ చేయాలి అనేది కూడా ముఖ్యం. ఫోన్‌లను వారానికి కనీసం మూడుసార్లు రీస్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీ T-Mobile ప్రకారం iPhone, Android ఫోన్‌లను వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాలి. ఇది ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. స్లో డౌన్, హ్యాంగ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లను రోజూ రీస్టార్ట్ చేయాలని చెబుతోంది. ఇది ఫోన్ పనితీరు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. Samsung Galaxy ఫోన్‌లలో ఆటో రీస్టార్ట్‌ని సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.