iQOO 13 Launch: ‘ఐకూ 13’ వచ్చేస్తోంది.. అల్ట్రా ఐకేర్ డిస్‌ప్లే, సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ..!
iQOO 13 Launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది.
iQOO 13 Launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల చైనాలో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఐకూ కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్, క్యూ2 గేమింగ్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఐకూ 13కు సంబందించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ 6.82 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. Q10 2k 144 హెచ్‌జెడ్ అల్ట్రా ఐకేర్ డిస్‌ప్లేతో వస్తున్న మొట్టమొదటి హ్యాండ్‌సెట్ ఇదే. దీంతో వినియోగదారులు గొప్ప గేమింగ్ అనుభవాన్ని పొందుతారు. భారత్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోన్న రెండవ ఫోన్ ఇది. ఇటీవల రియల్ మీ నుంచి ఫోన్ వచ్చింది. ఐకూ 13లో ఇన్‌హౌస్ క్యూ2 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఇక ఐకూ ఓరిజిన్ 5 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ కాగా.. Samsung S5KJN1 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ Sony IMX816 టెలిఫోటో కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరాను ముందుభాగంలో ఇచ్చారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే.. 6150 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దుమ్ము, నీరు దరి చేరకుండా ఐపీ 69 రేటింగ్ ఉంది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఐకూ 12 కంటే దీని ధర ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఐకూ 12 ప్రారంభ ధర రూ.49,999గా ఉంది. ఐకూ 13 ప్రారంభ ధర రూ.52,999గా ఉండే అవకాశాలు ఉన్నాయి. చైనాలో వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్‌లో రిలీజ్ అయిన ఐకూ 13.. భారత్‌లో మాత్రం వైట్ లెజెండ్ ఎడిషన్, గ్రే షేడ్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి డీటెయిల్స్ తెలియరానున్నాయి.