JioHotstar: దటీజ్ అంబానీ మావా.. ఇక ఫ్రీగా ఐపీఎల్ చూడొచ్చు.. ఎలాగంటే?
JioHotstar: జియో కొత్త ఆఫర్‌లో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌పై 90 రోజుల పాటు JioHotstar ఉచితంగా లభిస్తుంది.

JioHotstar: జియో నుంచి క్రికెట్ అభిమానులకు ఇదే గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్‌స్టేజీకి చేరుకుంటున్న వేళ.. జియో కొత్తగా ఓ స్పెషల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌తో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఉండనున్నాయి. ఇలా చేస్తే వినియోగదారులకు 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఉచితంగా లభించనుంది. మొబైల్ లేదా టీవీలో 4K క్వాలిటీతో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. కొత్తగా జియో సిమ్ తీసుకునే వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక ఇండియాలో ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమై మే 25 వరకు కొనసాగనుంది. ఈ క్రికెట్ వేడుకను మరింత ఆస్వాదించేందుకు జియో వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, జియో వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన బెనిఫిట్‌ను కూడా అందుబాటులో ఉంచింది.
50 రోజుల పాటు JioFiber లేదా JioAirFiber సేవలను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రయల్ సమయంలో వారికి 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్, 11+ OTT యాప్‌ల యాక్సెస్, అపరిమిత వైఫై లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను పొందాలనుకుంటే, వినియోగదారులు మార్చి 17 నుంచి మార్చి 31, 2025 మధ్య కొత్త జియో సిమ్ కొనుగోలు చేయాలి లేదా. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ డబ్బు పెట్టి రీఛార్జ్ చేయాలి. పూర్తి వివరాలు కోసం వినియోగదారులు 60008-60008 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.
ఈ ఆఫర్ మార్చి 22న మొదలవుతుంది. అంటే IPL సీజన్ మొదటి మ్యాచ్ రోజునుంచే ఈ ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. ఇక మార్చి 17కు ముందు రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్‌ను పొందాలంటే రూ.100 యాడ్-ఆన్ ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం జియో అధికారిక వెబ్‌సైట్ jio.comను సందర్శించవచ్చు లేదా సమీపంలోని జియో స్టోర్‌కు వెళ్లొచ్చు.