IPhone 15: తొలిసారి టైప్-సీ పోర్ట్‌తో ఐపోన్ 15 విడుదల.. 48 మెగాపిక్సెల్‌తోపాటు వావ్ అనిపించే ఫీచర్లు.. భారత్‌లో ధరెంతో తెలుసా?
IPhone 15: టెక్ కంపెనీ యాపిల్ మంగళవారం తన వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9లను విడుదల చేసింది.
IPhone 15: టెక్ కంపెనీ యాపిల్ మంగళవారం తన వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9లను విడుదల చేసింది. ఇది కాకుండా, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా విడుదల చేసింది. ఛార్జింగ్ కోసం తొలిసారిగా కంపెనీ టైప్-సి పోర్ట్‌ను అందించింది.
ఈసారి iPhone-15లో 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఐఫోన్ 15, 15 ప్లస్‌లలో A16 బయోనిక్ చిప్ అందించింది. అయితే A17 బయోనిక్ చిప్ iPhone 15 Pro, Pro Maxలో అందుబాటులో ఉంటుంది. ప్రో మోడల్స్‌లో టైటానియం కూడా ఉపయోగించారు.
భారతదేశంలో, iPhone-15 128 GB వేరియంట్ ధర రూ. 79,900లు కాగా, iPhone-15 Plus 128 GB వేరియంట్ ధర రూ. 89,900లు పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ రూ. 1,34,900కి, ప్రో మాక్స్ యొక్క 256 జీబీ వేరియంట్ రూ. 1,59,900కి అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్, వాచ్ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి..
కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్ 15 సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. కొత్త ఆపిల్ వాచ్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది కూడా సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది. టైప్ సి పోర్ట్‌తో ఎయిర్‌పాడ్స్ ప్రో రెండవ తరం సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 9ని కూడా..
కంపెనీ ఆపిల్ వాచ్ సిరీస్ 9ని 8 కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ వాచ్‌లో డబుల్ ట్యాప్ ఫీచర్ అందింది. అంటే రెండు సార్లు వేళ్లతో నొక్కడం ద్వారా ఫోన్ కాల్ వెళ్తుంది. రెండు సార్లు ట్యాప్ చేయడంతో ఫోన్ కూడా డిస్‌కనెక్ట్ అవుతుంది. కంపెనీ యాపిల్ వాచ్ అల్ట్రా 2ను కూడా విడుదల చేసింది.
ఇకపై తమ ఉత్పత్తుల్లో లెదర్‌ను ఉపయోగించబోమని యాపిల్ తెలిపింది. అమెరికాలో Apple Watch Series 9 GPS వేరియంట్ ధర $399లు పేర్కొంది. GPS+ సెల్యులార్ ధర $499లు కాగా, వాచ్ అల్ట్రా 2 ధర $799లుగా పేర్కొంది.
ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఐఫోన్ 15ను తయారు చేస్తోంది.
తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలోని తమిళనాడు ప్లాంట్‌లో ఐఫోన్ 15 ను తయారు చేస్తోంది. ఉత్పత్తిని వేగవంతం చేయడానికి, ఫాక్స్‌కాన్ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి మార్గాలను కూడా పెంచింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో, ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్‌తో పాటు అనేక ఇతర ఉత్పత్తులను విడుదల చేస్తుంది.
2017 నుంచి భారతదేశంలో ఐఫోన్‌లు తయారీ..
Apple 2017లో iPhone SEతో భారతదేశంలో iPhoneలను తయారు చేయడం ప్రారంభించింది. ఇది మూడు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ (EMS) భాగస్వాములను కలిగి ఉంది - Foxconn, Wistron, Pegatron. iPhone SE తర్వాత, iPhone 11, iPhone 12, iPhone 13, iPhone 14 కూడా భారతదేశంలోనే తయారు చేశారు. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఉంది.
Apple మూడు కాంట్రాక్ట్ తయారీదారులు (Foxconn, Wistron, Pegatron) భారత ప్రభుత్వం రూ. 41,000 కోట్ల ఉత్పత్తి-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (PLI)లో భాగం. ఈ పథకం తర్వాతే భారతదేశంలో ఐఫోన్ తయారీ పెరిగింది. 2020లో, భారత ప్రభుత్వం PLI పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా, బయటి దేశాల కంపెనీలు స్థానిక తయారీని ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతాయి. దానిపై ప్రోత్సాహకాలను కూడా పొందుతాయి.