Flipkart Year End Sale: ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: రూ. 69,900 ధర ఉన్న iPhone 15 128GB బేస్ వేరియంట్ ఇప్పుడు Flipkartలో రూ.59,999కే అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధరపై రూ. 9,901 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.
Flipkart Year End Sale: మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ 15ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మొబైల్స్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 69,900 ధర ఉన్న iPhone 15 128GB బేస్ వేరియంట్ ఇప్పుడు Flipkartలో రూ.59,999కే అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధరపై రూ. 9,901 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.
గ్రీన్ కలర్ వేరియంట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.58,999 తక్కువ ధరకే అందిస్తోంది. అంటే మరో రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తోందన్నమాట. అదనంగా మీరు మీ పాత ఫోన్‌ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌ను బట్టి రూ.56,500 వరకు తగ్గింపు లభిస్తోంది.
మీరు మీ పాత iPhone 12ని ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద మార్చుకుంటే రూ. 22,700 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత Samsung Galaxy S22ని మార్చుకుంటే, మీరు రూ. 20,300 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని అర్థం సరైన మార్పిడితో మీరు ఐఫోన్ 15 ధరను గణనీయంగా తగ్గించవచ్చు. కొత్త ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు ఇది సువర్ణావకాశం.
ఐఫోన్ 15 యాపిల్ A16 బయోనిక్ చిప్‌తో రన్ అవుతుంది. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. మీరు గేమింగ్ చేస్తున్నా, రీల్స్‌ని ఎడిట్ చేస్తున్నా లేదా బ్రౌజింగ్ చేస్తున్నా.. పని ఏదైనా ఈ ఫోన్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మొబైల్ OLED డిస్ప్లేను కలిగి ఉంది. అదనంగా, iPhone 15 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది. ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ ధరలో ఈ ఫోన్ కచ్చితంగా సూట్ అవుతుంది ( Photography on iPhne 15).