Infinix Zero Flip: చరిత్ర సృష్టించబోతున్న ఇన్ఫినిక్స్.. ట్రిపుల్ కెమెరాతో ఫోల్డ్ ఫోన్ లాంచ్!

Infinix భారతదేశంలో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ Infinix ZERO Flipని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Update: 2024-10-11 11:00 GMT

Infinix Zero Flip: చరిత్ర సృష్టించబోతున్న ఇన్ఫినిక్స్.. ట్రిపుల్ కెమెరాతో ఫోల్డ్ ఫోన్ లాంచ్!

Infinix భారతదేశంలో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ Infinix ZERO Flipని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. ఇటీవలే కంపెనీ భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఇది అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ కానుంది. ఫోన్ మైక్రోసైట్ కంపెనీ అధికారిక సైట్‌లో లైవ్ అవుతుంది. కంపెనీ ఇప్పటికే మైక్రోసైట్‌లో ఫోన్ అనేక ఫీచర్లను టీజ్ చేసింది. ఇప్పుడు కంపెనీ కెమెరా స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. ఇది మూడు 50MP కెమెరాలను కలిగి ఉన్న సెగ్మెంగ్ నుండి వచ్చిన మొదటి ఫోన్ అని క్లెయిమ్ చేస్తోంది. ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం.

మైక్రోసైట్ ప్రకారం Infinix ZERO Flip స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS, 4K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50MP అల్ట్రా-క్లియర్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా, రికార్డింగ్ కోసం అల్ట్రా స్టెడీ మోడ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

50MP ప్రైమరీ కెమెరాతో పాటు, ఫోన్ వెనుక భాగంలో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇది 114 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో వస్తుంది. క్లారిటీ గ్రూప్ షాట్‌లను సమ్మరైజ్ చేయడానికి వెనుకవైపు డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇచ్చే 50MP Samsung కెమెరాను కలిగి ఉంది. డ్యూయల్ వ్యూ, డివి మోడ్, గ్రోప్రో మోడ్ వంటి కెమెరా మోడ్‌లు ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

జీరో ఫ్లిప్ లైటింగ్ కోసం LED, స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్లతో కూడిన హోవర్ సెల్ఫీ కెమెరాను కూడా ఉంది. ఈ ఫోన్ GoProకి కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా వినియోగదారులు ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్‌ని సృష్టించగలరు. ముందు, వెనుక కెమెరాల నుండి ఏకకాలంలో రికార్డింగ్ చేయడానికి ఫోన్‌లో డ్యూయల్ వ్యూ మోడ్ సపోర్ట్ చేస్తోంది.

మైక్రోసైట్ ప్రకారంస్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ విభాగంలో ఇదే అతిపెద్ద కవర్ డిస్‌ప్లే అని కంపెనీ పేర్కొంది. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రోటక్షన్, పీక్ బ్రైట్నెస్ 1100 నిట్‌ల వరకు అందిస్తుంది. ఫోన్ ఓపెన్ చేయకుండానే కవర్ స్క్రీన్ నుంచి 100కు పైగా యాప్‌లను రన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్ 6.9-అంగుళాల AMOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1400 nits పీక్ బ్రైట్‌నెస్, UTG ప్రొటక్షన్‌తో వస్తుంది.

కంపెనీ 4 లక్షల సార్లు ఫోల్ట్ కోసం టెస్ట్ చేసింది. అంటే 5 సంవత్సరాల పాటు ఫోన్‌ను రోజుకు 200 కంటే ఎక్కువ సార్లు మడతపెట్టచ్చు. Infinix AI సపోర్ట్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. పింక్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కంపెనీ ఫోన్‌ను టీజ్ చేసింది.

Tags:    

Similar News