IRCTC Super App: ఐఆర్సీటీసీ నుంచి సూపర్ యాప్.. ఇక నుంచి టికెట్స్ బుకింగ్ చాలా ఈజీ..!
IRCTC Super App: భారతీయ రైల్వే త్వరలో ఒక కొత్త IRCTC సూపర్ యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
IRCTC Super App: భారతీయ రైల్వే త్వరలో ఒక కొత్త IRCTC సూపర్ యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది ఒకే ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణీకులకు అన్ని రైలు సంబంధిత సేవలను అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్‌ను IRCTC, CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఒకే యాప్‌లో టికెట్ బుకింగ్, సరుకు రవాణా, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక సేవలను ప్రయాణికులు పొందగలుగుతారు.
IRCTC Super App Features
IRCTC సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న అనేక యాప్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఏకీకృతం చేస్తుంది. తద్వారా ప్రయాణికులు వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్‌లో కింది ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి:
1. రిజర్వ్ చేసిన, చేయని టిక్కెట్ బుకింగ్.
2. ప్లాట్‌ఫామ్ పాస్
3. ట్రైన్ రియల్ టైమ్ ట్రాకింగ్
4. ఫుడ్ , క్యాటరింగ్ సర్వీస్‌లు
5. అభిప్రాయం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.
IRCTC సూపర్ యాప్ ద్వారా, ప్రయాణీకులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో రైలుకు సంబంధించిన అన్ని సర్వీస్ పొందుతారు. ఈ యాప్ టిక్కెట్ బుకింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా, క్యాటరింగ్, రైలు ట్రాకింగ్ వంటి సేవలను కూడా ఏకీకృతం చేస్తుంది. దీనితో పాటు, ఈ యాప్ IRCTC ఆదాయ సామర్థ్యాన్ని పెంచడానికి గొప్ప మాధ్యమంగా కూడా మారుతుంది.
రైల్వేలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను నిర్వహించే బాధ్యత కలిగిన CRIS ఈ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్ డిసెంబర్ 2024లో ప్రారంభించే అవకాశం ఉంది. IRCTC సూపర్ యాప్ భారతీయ రైల్వేల డిజిటలైజేషన్ దిశగా ఒక పెద్ద అడుగు. ఈ యాప్ రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సరళంగా చేస్తుంది.