Train Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి అడ్వాన్స్ బుకింగ్ అలా చేయలేరు..!

Train Ticket Booking: ప్యాసింజర్ రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

Update: 2024-10-17 11:17 GMT

Train Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి అడ్వాన్స్ బుకింగ్ అలా చేయలేరు..!

Train Ticket Booking: ప్యాసింజర్ రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. నవంబర్ 1, 2024 నుంచి టికెట్ బుకింగ్ కోసం కొత్త టైమ్ రూల్ అమల్లోకి వస్తుందని రైల్వే తెలిపింది. రైల్వే బోర్డు డైరెక్టర్ (ప్యాసింజర్ మార్కెటింగ్) సంజయ్ మనోచా మాట్లాడుతూ.. నవంబర్ 1, 2024 నుండి రైళ్లలో ప్రస్తుత ముందస్తు రిజర్వేషన్ పరిమితిని 120 రోజుల నుండి 60 రోజులకు (ప్రయాణ తేదీ మినహా) తగ్గించి, బుకింగ్ కూడా దీని ప్రకారం జరుగుతుంది. 

సంజయ్ మనోచా మాట్లాడుతూ..  అక్టోబర్ 31, 2024 వరకు 120 రోజుల ARP (అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్) కింద చేసిన అన్ని బుకింగ్‌లు అలాగే ఉంటాయి. కానీ 60 రోజులకు మించి చేసిన ARP బుకింగ్‌లను రద్దు చేయడానికి అనుమతిస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం తక్కువ పరిమితులు ఇప్పటికే అమలులో ఉన్న తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ మొదలైన కొన్ని పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో ఎలాంటి మార్పు ఉండదు.

రైళ్లలో సుదూర ప్రాంతాలకు లేదా పెళ్లి, పండుగ, పరీక్షలు వంటి ఏదైనా ప్రత్యేక అవసరాల కోసం ప్రయాణించే వ్యక్తులు 4 నెలల ముందుగానే రైళ్లలో సీట్లు బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇది సాధ్యం కాదు. కొత్త నిబంధన తర్వాత, రైల్వే ప్రయాణికులు గరిష్టంగా 2 నెలల వ్యవధిలో మాత్రమే రైళ్లలో సీట్లు బుక్ చేసుకోగలరు.

పాత రూల్ ప్రకారం మీరు మే 1, 2025న నడుస్తున్న రైలు కోసం టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి వస్తే మీరు 120 రోజుల ముందుగా అంటే జనవరి 1, 2025న టిక్కెట్‌ను బుక్ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత మీరు మే 1, 2025న నడుస్తున్న రైలులో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు గరిష్టంగా 60 రోజుల ముందుగా అంటే మార్చి 2న టిక్కెట్‌ను బుక్ చేసుకోగలరు.

Tags:    

Similar News