Power Bill: ఏసీ బిల్లులతో విసిగిపోయారా.. అతి తక్కువ ధరకే ఏసీలు విక్రయిస్తోన్న ప్రభుత్వం..!
EESLMart: కొంతకాలం క్రితం, EESL (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) EESLMart పేరుతో తన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
Energy Efficiency Services Limited: ఏ కాలంలోనైనా ఇంటిని చల్లబరచడానికి AC అవసరం. కానీ, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా భారీ విద్యుత్ బిల్లును చూసి కళ్లు తేలేస్తుంటాం. చాలా ఇళ్లలో ఏసీ వాడకంతో రూ.4 నుంచి 5 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. కానీ, ఏసీ ఆన్ చేయకపోతే వేడితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు కూడా చేసింది. కొంతకాలం క్రితం, EESL (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) EESLMart పేరుతో తన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక్కడ విద్యుత్ ఆదా చేసే ఏసీలు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇవి విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా స్టైలిష్ డిజైన్‌లో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
1.5 TR సూపర్ ఎఫిషియెంట్ 5 స్టార్ స్ప్లిట్ AC..
ISEER 1.5 TR సూపర్ ఎఫిషియెంట్ 5 స్టార్ స్ప్లిట్ AC అనేది చాలా మంచి ఎయిర్ కండీషనర్. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. మీ గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది. EESLMartలో దీని ధర రూ.44,141లుగా పేర్కొన్నారు. వెబ్‌సైట్ ప్రకారం, ఇది 15 రోజుల్లో డెలివరీ చేయనున్నారు. 7 రోజుల్లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది కాపర్ కండెన్సర్ కాయిల్, నానో కోటింగ్ కాపర్‌తో చేసిన భాగాలను కలిగి ఉంటుంది. సాంప్రదాయ 5 స్టార్ ఏసీ కంటే 14% తక్కువ విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
1.0 TR సూపర్ ఎఫిషియెంట్ 5 స్టార్ స్ప్లిట్ AC..
మీకు 1 టన్ను AC కావాలంటే, దానికి కూడా ప్రభుత్వానికి ఏర్పాట్లు చేసింది. దీని ధర ఇప్పుడు రూ.33,456లుగా పేర్కొంది. ఇది కూడా 15 రోజుల్లో డెలివరీ చేయబడుతుంది. 7 రోజుల్లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. సాంప్రదాయ 5 స్టార్ ACతో పోలిస్తే ఇది 19% తక్కువ శక్తిని వినియోగించగలదు. టన్ను కాకుండా, ఇది 1.5 టన్ను ACలో ఉండే అన్ని వస్తువులను కలిగి ఉంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను పరిశీలిస్తే అక్కడ చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొన్ని 2 స్టార్‌తో, మరికొన్ని 4 స్టార్ రేటింగ్‌తో వస్తాయి. విద్యుత్‌ను పెద్దగా ఆదా చేయలేకపోతున్నాయి. అక్కడ ధరలు తక్కువగా ఉన్నా కరెంటు బిల్లులు మాత్రం ఆదా చేయలేకపోతున్నారు. కరెంటు బిల్లు ఆదా కావాలంటే ఈ ఏసీలు తీసుకోవచ్చు.