Common Charging Port: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని ఫోన్లకు ఒకే రకమైన ఛార్జర్..

Common Charging Port: అన్ని రకాల ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉంటే బాగుంటుందన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-11-17 14:45 GMT

Common Charging Port: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని ఫోన్లకు ఒకే రకమైన ఛార్జర్..

Common Charging Port: అన్ని రకాల ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉంటే బాగుంటుందన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మన దేశంలో అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు కలిగి ఉండాలని ఆదేశించింది. అన్నింటికీ టైప్–సి రకం యూఎస్బీ పోర్టు అందుబాటులోకి తీసుకురావాలి తెలిపింది. ఈ మేరకు భారత ప్రభుత్వం.. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దేశంలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ తీసుకురావాలన్న కేంద్ర వినియోదారుల వ్యవహారాల మంత్రి శాఖ ప్రతిపాదనకి ఆయా పరిశ్రమల ప్రతినిధులు అంగీకరించారు. ఒకే ఛార్జింగ్ పోర్ట్ తో వినియోగదారుల సౌలభ్యం పెరగడంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా తగ్గనున్నాయి.

Tags:    

Similar News