HP సరికొత్త ల్యాప్‌టాప్‌లు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ధర ఎంతంటే..?

HP New Laptops: ల్యాప్‌టాప్‌ విక్రయాలలో హెచ్‌పీ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పటి కప్పుడు వినియోగదారులకు సరికొత్త ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది.

Update: 2024-02-15 11:45 GMT

HP సరికొత్త ల్యాప్‌టాప్‌లు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ధర ఎంతంటే..?

HP New Laptops: ల్యాప్‌టాప్‌ విక్రయాలలో హెచ్‌పీ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పటి కప్పుడు వినియోగదారులకు సరికొత్త ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది. తాజాగా స్పెక్టర్ x360 14-అంగుళాల, 16-అంగుళాల ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌లు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇది మరింత వేగం, కచ్చితత్వంతో పనిచేస్తుంది.సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. ఇందులో "న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్" (NPU) ని వినియోగించారు. సాధారణ వినియోగదారుల కోసం తయారు చేసిన HP ల్యాప్‌టాప్‌లలో NPU టెక్నాలజీ అందించడం ఇదే మొదటిసారి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనులను వేగంగా, సులభంగా పూర్తి చేయడానికి NPU, CPU, GPUతో కలిసి పని చేస్తుంది. అదనంగా ఈ ల్యాప్‌టాప్‌లలో NVIDIA స్టూడియో, RTX 4050, GFX ఉపయోగపడుతాయి. దీని అర్థం వీడియో ఎడిటింగ్ వేగంగా ఉంటుంది. కంటెంట్ సృష్టి గతంలో కంటే సులభం అవుతుంది. కొత్త స్పెక్టర్ x360 ల్యాప్‌టాప్‌లు వేగంగా మీ అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించే గుణం కలిగి ఉంటాయి. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. నేటి వేగవంతమైన పనికి సరైనది. ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్నా ఈ ల్యాప్‌టాప్‌లు మీ పనిని సులభతరం చేస్తాయి.

HP స్పెక్టర్ x360 ల్యాప్‌టాప్ స్పెక్స్

కొత్త స్పెక్టర్ x360 ల్యాప్‌టాప్‌లు మెరుగైన చిత్రాలు, మరిన్ని రంగుల కోసం 2.8K OLED స్క్రీన్‌తో వస్తాయి. ఇది సినిమాలను చూడటానికి ప్రత్యేకమైన IMAX టెక్నాలజీని కలిగి ఉంది. మీరు 16:10 స్క్రీన్‌పై ఏకకాలంలో మరిన్ని పనులను చేసుకోవచ్చు. 16-అంగుళాల మోడల్‌లోని సిగ్నేచర్ టచ్‌ప్యాడ్ విండోస్ ల్యాప్‌టాప్‌లకు కొత్త బెంచ్‌మార్క్ అని చెప్పవచ్చు. కొత్త HP Specter x360 ల్యాప్‌టాప్‌లు HP వరల్డ్ స్టోర్‌లు, HP ఆన్‌లైన్ స్టోర్, ఇతర ప్రధాన స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 14 అంగుళాల ల్యాప్‌టాప్ ధర రూ. 1,64,999 నుంచి ప్రారంభం కాగా, 16 అంగుళాల ల్యాప్‌టాప్ ధర రూ.1,79,999 నుంచి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News