Car Hacking: మీ కారు హ్యాక్‌ చేస్తున్నారని మీకు తెలుసా.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Car Hacking: నేటి డిజిటల్‌ యుగంలో హ్యాకింగ్‌కు కాదేది అనర్హం అన్నమాదిరిగా ప్రతీది మారి పోయింది.

Update: 2024-05-26 03:30 GMT

Car Hacking: మీ కారు హ్యాక్‌ చేస్తున్నారని మీకు తెలుసా.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Car Hacking: నేటి డిజిటల్‌ యుగంలో హ్యాకింగ్‌కు కాదేది అనర్హం అన్నమాదిరిగా ప్రతీది మారి పోయింది. టెక్నాలజీ పెరగడం వల్ల హ్యాకర్ల పని మరింత సులువుగా మారిపోయింది. ఆధునిక సాంకేతికత వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే మొత్తంలో అప్రయోజనాలు కూడా ఉన్నా యి. ముఖ్యంగా సైబర్‌ దాడులు, హ్యాకింగ్‌ కేసులు పెరిగిపోయాయి. తాజాగా కొంతమంది హ్యాక ర్లు కార్లను కూడా హ్యాక్‌ చేస్తున్నారు. కొన్నిసార్లు దొంగిలించిన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. అందుకే కార్లు లాక్‌ చేసి, విండోలు మూసేస్తే సరిపోదు. కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

లేటెస్ట్‌ కార్లలో కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ ఫీచర్లు మీకు సమస్యలను సృష్టించవచ్చు. చాలా మందికి తమ కారు హ్యాక్ అవుతుందని కూడా తెలియదు. కారు సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి మీ పర్సనల్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహన యజమాను లు ఇబ్బందులు పడే సందర్భాలు ఎదురవుతాయి. కారు హ్యాకింగ్‌ను నివారించడానికి ఈ చిట్కాలను పాటించండి.

పాస్‌వర్డ్‌ను కారులో తెలిసే విధంగా ఉంచకూడదు. ఎవరైనా తప్పుడు ఉద్దేశ్యంతో మీ కారు లోపలికి వెళ్లి పాస్‌వర్డ్‌ను తీసుకుంటే వారికి చాలా పనులకు యాక్సెస్ ఇచ్చినట్లు అవుతుంది. కారు జీపీఎస్‌లో ఇంటి చిరునామా ఎప్పుడూ సేవ్ చేయవద్దు. దీనివల్ల హ్యాకర్లు మీ ఇంటి అడ్రస్‌ను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కారు వైర్‌లెస్, రిమోట్ సిస్టమ్‌లను కలిగి ఉంటున్నాయి. వీటిని సులువుగా హ్యాక్ చేయవచ్చు. అందుకే వైర్‌లెస్ సిస్టమ్‌ను పొదుపుగా వాడడం ఉత్తమం.

కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా ముఖ్యమైన భాగం. మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని అప్‌డేట్ చేసినట్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కొన్ని ప్రమాదాలు తగ్గుతాయి. కారులో థర్డ్‌ పార్టీ యాప్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దు. ఇది సిస్టమ్‌లోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టగలదు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వెబ్ బ్రౌజర్‌ని మాత్రమే ఉపయోగించడం మేలు.

Tags:    

Similar News