Honor X60 Series: హానర్ నుంచి అదిరిపోయే ఫోన్లు.. ధర చాలా తక్కువ గురూ!
Honor X60 Series: హానర్ తన X60 సిరీస్‌లో 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.
Honor X60 Series: హానర్ తన X60 సిరీస్‌లో 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ లైనప్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. అందులో Honor X60, Honor X60 Pro. X50 సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ ఫోన్ చైనాలో విడుదలైంది. రెండు మోడల్‌లు కెమెరా సెంట్రిక్‌గా ఉంటాయి. రెండు ఫోన్‌లు శక్తివంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉంటాయి. అయితే X60 ప్రో వేరియంట్‌లో Snapdragon చిప్‌సెట్ ఉంటుంది. ఫోన్ ధర అన్ని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Honor X60 Series
బేస్ 8GB + 128GB కాన్ఫిగరేషన్ మోడల్ కోసం Honor X60 ధర CNY 1,199 (దాదాపు రూ. 14,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది గరిష్టంగా 12GB RAM + 512GB స్టోరేజ్, మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఎలిగెంట్ బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ కిన్.
హానర్ X60 ప్రో బేస్ 8GB + 128GB మోడల్ ధర CNY 1,499 (సుమారు రూ. 18,000) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ గ్రే, బ్లాక్, ఆరెంజ్, సీ గ్రీన్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.
Honor X60 ఫోన్ 6.8 అంగుళాల TFT LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7025-Ultra చిప్‌సెట్‌తో వస్తుంది. X60 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,800mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ మోడల్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
Honor X60 Pro 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 12GB RAM + 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. X60 ప్రో స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది వేగవంతమైన 66W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Honor X60 సిరీస్‌లోని రెండు మోడళ్లలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.