Jio Super Plan: జియో సూపర్​ ప్లాన్.. తక్కువ ధరలో నెల రోజుల వ్యాలిడీటీ ఇంకా డేటా కూడా..!

Jio Super Plan: టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్​ అందిస్తుంది.

Update: 2023-09-26 06:10 GMT

Jio Super Plan: జియో సూపర్​ ప్లాన్.. తక్కువ ధరలో నెల రోజుల వ్యాలిడీటీ ఇంకా డేటా కూడా..!

Jio Super Plan: టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్​ అందిస్తుంది. అందుకే ప్రతి నెల కస్టమర్లను పెంచుకుంటూ వస్తోంది. అన్ని కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంటుంది. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.123 రీఛార్జ్​ ప్లాన్​ చాలా హిట్​ అయింది. దీంతో తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, ఇంకా డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రీచార్జ్​ ప్లాన్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్‌ జియో రూ.123 ప్లాన్​ జియో భారత్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. జియో వినియోగదారులకు ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్​, ఇంకా 14 జీబీ డేటా అందిస్తోంది. రోజుకు 500 ఎంబీ డేటా మొత్తం 14 జీబీ డేటా వరకు అందిస్తోంది. ఈ ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకున్న కస్టమర్లు దేశంలోని ఏ ప్రాంతానికైనా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతే కాదు ఉచిత ఎస్‌ఎంఎస్‌ ఆఫర్ కూడా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో 28 రోజుల పాటు జియో సిమ్‌ని యాక్టివేట్ చేయడానికి ఈ ప్లాన్​ ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు.

అలాగే జియో రూ.1234 వార్షిక ప్లాన్​ కలిగి ఉంది. ఈ ప్యాక్‌ని రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం మొత్తానికి రీఛార్జ్ చేయడం అవసరం లేదు. 365 రోజులు అపరిమిత కాలింగ్‌తో సహా అనేక ఆఫర్‌లను పొందుతారు. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో వినియోగదారులు 128 జీబీ డేటా కూడా పొందుతారు. అయితే ఎక్కువ డేటా మాత్రం లభించదు. ఏడాది పాటు ఉచిత కాలింగ్​కు మాత్రం ఈ ప్లాన్​ బాగా సెట్​ అవుతుంది.

Tags:    

Similar News