Vivo V30 5G: ఇది ఊహించలేదు.. కెమెరా కింగ్.. వివో 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్..!
Vivo V30 5G: ఫ్లిప్‌కార్ట్ Vivo V30 5G స్మార్ట్‌ఫోన్‌పై అతిపెద్ద తగ్గింపు ఆఫర్ చేస్తోంది. కు 23 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
Vivo V30 5G: ప్రస్తుత కాలంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపించని మనుషులు లేరు. స్కూళ్లకు వెళ్లే పిల్లల నుంచి ఇంట్లో ఉండే పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఫోన్లు ఉపయోగిస్తున్నారు. కాల్స్ మాట్లాడటానికి, చాటింగ్ చేయడానికి, సినిమాలు చూడటానికి.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అవసరాలకు స్మార్ట్‌ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. మొబైల్ లవర్స్ అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు అప్‌డేటెడ్ ఫీచర్లతో ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వినియోగదారులు కూడా అప్‌డేట్‌గా ఉంటే ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో మీరు కూడా మంచి డిజైన్, ఫీచర్లతో ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. Vivo V30 5G స్మార్ట్‌ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీతో కూడిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం గొప్ప ఆఫర్‌తో అందుబాటులో ఉంది.
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌పై అతిపెద్ద తగ్గింపు ఆఫర్ చేస్తోంది. Vivo స్మార్ట్‌ఫోన్‌లు కెమెరా క్వాలిటీ విషయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్. దీని వెనుక, ముందు రెండు వైపులా టాప్ నాచ్ సెన్సార్‌లను కలిగి ఉంది. Vivo V30 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో మీరు 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
Vivo V30 5G స్మార్ట్‌ఫోన్ 128GB వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 38,999గా ఉంది. ఇప్పుడు కొంటే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై వినియోగదారులకు 23 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. ఫ్లాట్ తగ్గింపుతో మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 29,939కి కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు కంపెనీ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా కాంబో కొనుగోలుపై కంపెనీ రూ.100 తగ్గింపును ఇస్తోంది. బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ పొందుతారు.
Vivo V30 5Gని కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో కూడిన గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో కంపెనీ 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇచ్చింది. దీనిలో AMOLED ప్యానెల్ ఉంటుంది. డిస్‌ప్లే 1B కలర్స్ , HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ డిస్‌ప్లేలో షాట్ ఆల్ఫా ప్రొటక్షన్ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14లో రన్ అవుతుంది.
Vivo స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో Adreno 720 GPU ససోర్ట్ ఉంటుంది. ఇందులో మీకు 12GB RAM+ 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50+50+2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఇది 80W ఫాస్ట్ ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.