Gold Smartwatch: గోల్డ్ స్మార్ట్‌వాచ్.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ..!
Gold Smartwatch: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది.
Gold Smartwatch: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పలు కంపెనీలు రకరకాల కొత్త వేరియేషన్లలో తయారుచేస్తున్నాయి. వినియోగదారులని ఆకట్టుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫైర్-బోల్ట్ బ్లిజార్డ్ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పుడు నాలుగు కొత్త రంగులను పరిచయం చేసింది. గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రోజ్ గోల్డ్, గోల్డ్ బ్లాక్ రంగులలో ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.3,799కి అందిస్తున్నాయి.
ఫైర్-బోల్ట్ బ్లిజార్డ్ స్పెక్స్
ఈ స్మార్ట్‌వాచ్ క్లాసిక్ డిజైన్‌తో స్మార్ట్ ఫంక్షనాలిటీలతో వస్తుంది. ఇందులో డ్యూయల్ షేడ్స్ ఉంటాయి. హోమ్ బటన్, నావిగేషన్ కోసం బ్యాక్ బటన్‌తో సంపూర్ణంగా ఉంటుంది. IP67 సర్టిఫికేషన్‌తో నీటి నిరోధకతను నిర్ధారిస్తుంది. ఫైర్-బోల్ట్ బ్లిజార్డ్ వృత్తాకార డయల్ 1.28-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది.
వాచ్‌లో అనేక రకాల ఆరోగ్య ఫీచర్లు ఉంటాయి. ఇది హృదయ స్పందన రేటు మానిటర్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి ట్రాకింగ్ కోసం SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, మహిళల ఋతు చక్రం మానిటర్, ఇంకా వివిధ ఫిట్‌నెస్ కార్యకలాపాల కోసం 120 గేమ్ మోడ్‌లతో వస్తుంది. దీని లోపలి స్పీకర్, డయల్ ప్యాడ్‌తో నేరుగా బ్లూటూత్ కాలింగ్‌ను ప్రారంభించవచ్చు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ సంభాషణలను అనుమతిస్తుంది. ఇందులో ఉండే స్మార్ట్ నోటిఫికేషన్‌లు మిమ్మల్ని రోజంతా అప్‌డేట్‌గా ఉంచుతాయి. వాచ్‌లో 220mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు వస్తుంది.