Mobile Signal Problem: ఇంట్లోకి వెళ్లగానే మొబైల్‌లో సిగ్నల్ పడిపోతుందా.. ఇలా చేయండి..!
Mobile Signal Problem: ఈ రోజుల్లో చాలామంది మొబైల్ సిగ్నల్స్ సమస్యను ఎదుర్కొంటు న్నారు. నగరాలు, పట్టణాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.
Mobile Signal Problem: ఈ రోజుల్లో చాలామంది మొబైల్ సిగ్నల్స్ సమస్యను ఎదుర్కొంటు న్నారు. నగరాలు, పట్టణాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు ఇంట్లో అడుగుపెట్టగానే సెల్‌ఫోన్‌లో సిగ్నల్స్ మాయమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు వారు ఎవరికీ కాల్ చేయలేరు. అలాగే ఇతరులు చేస్తే మీకు లైన్ కలవదు. మీరు ఒక్కసారి ఇంటి నుంచి బయటికి రాగానే మీకు ఫోన్ ట్రై చేసినట్లు మెస్సేజ్‌లు వస్తుంటాయి. ఇంట్లో నెట్‌వర్క్ సమస్య ఉంటే మీరు కాల్‌లు చేయలేరు ఇంటర్నెట్ వాడలేరు. నిజానికి ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. భవన నిర్మాణం, భవనం ఎత్తు, టవర్ నుంచి దూరం ఇలా అనేక కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. మీరు చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
ఈ పరికరంతో సమస్య దూరం..
ఇంట్లో సెల్యూలార్ నెట్‌వర్క్ అనే బూస్టింగ్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేసి సిగ్నల్స్ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల రాత్రిపూట ఇంట్లో సిగ్నల్స్ బాగుంటాయి. మీరు ఈ పరికరాన్ని ఆన్‌లైన్‌లో రూ.3000 నుంచి రూ.4000 మధ్య సులభంగా కొనుగోలు చేయవచ్చు. సిగ్నల్ బలహీనంగా ఉన్న చోట దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. దీనిని ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా సులభం. ఈ పరికరం చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏ మూలలోనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ అందరికీ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఇంటర్నెట్ వాడడం, కాల్స్ చేయడం సులభమవుతుంది.