Smartphone Battery Mistakes: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోయిందా.. పొరపాటున ఈ తప్పులు చేయవద్దు..!
Smartphone Battery Mistakes: కొంతమంది స్మార్ట్‌ఫోన్ ఇష్టమొచ్చినట్లు వాడుతుంటారు. దాని జాగ్రత్త గురించి అస్సలు పట్టించుకోరు.
Smartphone Battery Mistakes: కొంతమంది స్మార్ట్‌ఫోన్ ఇష్టమొచ్చినట్లు వాడుతుంటారు. దాని జాగ్రత్త గురించి అస్సలు పట్టించుకోరు. ఫోన్ ను కొన్నిసంవత్సరాలు వాడిన తర్వాత దాని బ్యాటరీ ఉబ్బడం మొదలవుతుంది. ఫోన్ పరిమాణం మారుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బ్యాటరీ పాడైపోయిందని అనుకుంటారు. అయితే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల ఇలా జరుగుతుందని గుర్తించలేకపోతారు. ఈ రోజు ఆ విషయాల గురించి తెలుసుకుందాం.
వెనుక భాగంపై ఒత్తిడి చేయవద్దు
మీరు స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అధిక ఒత్తిడి చేయవద్దు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లోపల ప్రతిచర్య ఏర్పడుతుంది. అది వాపునకు కారణమవుతుంది.
బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవద్దు
మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు బ్యాక్‌ప్యాకెట్‌లో పెట్టుకోవద్దు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఉబ్బి, సమస్యలను కలిగిస్తుంది.
టెంపరేచర్ గమనించండి
మీరు స్మార్ట్‌ఫోన్‌ను అవసరమైన దానికంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే అది పాడవుతుంది. లేదంటే బ్యాటరీ ఉబ్బడం మొదలవుతుంది. ఆపై పాడైపోతుంది.
ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించవద్దు
బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం మానేయండి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఉబ్బిపోతుంది తర్వాత పాడైపోతుంది.
డూప్లికేట్ ఛార్జర్ వాడవద్దు
స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ పరిమాణం మారుతుందని అనిపిస్తే ముందుగా స్మార్ట్‌ఫోన్‌ను డూప్లికేట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసే అలవాటు మానుకోండి. ఇలాంటి ఛార్జర్ల వల్ల బ్యాటరీపై ఒత్తిడి పడి ఉబ్బడం మొదలవుతాయి. ఒక్కోసారి పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి.