AI: ఏఐ వాయిస్ క్లోనింగ్.. ఇదో కొత్త రకం మోసం. జాగ్రత్తగా లేకపోతే..
AI: ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు గొంతును మార్చేస్తూ మోసం చేస్తున్నారు.
AI: సైబర్ నేరగాళ్లు రోజుకో రకం మోసంతో రెచ్చిపోతున్నారు. అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్న సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్త మోసంతో ప్రజలను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. అయితే ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ. ఇంతకీ ఏంటి మోసం.? ఇందులో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉన్నపలంగా ఏదో అన్‌నోన్ నెంబర్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మీకు తెలిసిన వ్యక్తి గొంతును పోలిన వాయిస్‌తో మాట్లాడుతారు. అర్జెంట్‌గా డబ్బులు అవసరం ఉన్నాయనో, ఆసుపత్రిలో ఉన్నామనో కాల్ చేసి డబ్బులు అడుగుఆరు. వెంటనే డబ్బులు పంపించమని ఏదో ఒక ఫోన్ నెంబర్ చెబుతారు. అయితే పొరపాటు నమ్మి వారికి డబ్బులు పంపారో ఇక మీ పని అంతే. ఆ డబ్బులు మళ్లీ తిరిగి మీ దగ్గరికి రావు. ఎందుకంటే మీకు ఫోన్ చేసిన వ్యక్తి అసలు మీకు తెలిసిన అతనే కాదు. ఇలాంటి మోసాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి.
ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు గొంతును మార్చేస్తూ మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే ముందుగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో బ్యాంక్ ఖాతా సంబంధిత వివరాలు కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఎలాంటి ఓటీపీలు షేర్ చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి తెలియని ఖాతాల్లోకి డబ్బులు పంపించకూడదు.