Cooler Cleaning Tips: ఎండాకాలం కూలర్ని ఇలా క్లీన్ చేయండి.. చాలా రోజులు కొనసాగుతుంది..!
Cooler Cleaning Tips: రోహిణీకార్తె మొదలైంది ఎండలు ఇంకా దంచికొడుతాయి. దీంతో అందరూ చల్లదనాన్ని కోరుకుంటారు.
Cooler Cleaning Tips: రోహిణీకార్తె మొదలైంది ఎండలు ఇంకా దంచికొడుతాయి. దీంతో అందరూ చల్లదనాన్ని కోరుకుంటారు. ఇప్పటికే చాలామంది ఇండ్లలో ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చుంటున్నారు. మండే వేడి నుంచి ఇవి కాస్త ఉపశమనం అందిస్తున్నాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇవి తొందరగా పాడైపోతాయి. ముఖ్యంగా ఎయిర్ కూలర్ని వారంలో రెండుసార్లు క్లీన్ చేయాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. ఈ రోజు కూలర్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం.
ఎయిర్ కూలర్ ట్యాంక్‌లో ఎల్లప్పుడూ శుభ్రమైన, మంచినీటిని పోయాలి. నీటిలో ఉండే మలినాలు కూలర్‌లోని పంపు, ప్యాడ్‌లను దెబ్బతీస్తాయి. వారానికి కనీసం రెండుసార్లు ట్యాంక్‌ను ఖాళీ చేసి శుభ్రమైన నీటితో నింపాలి. దీంతో నీరు తాజాగా ఉండటమే కాకుండా బ్యాక్టీరియా వృద్ధిని నిలిపివేస్తుంది. ఎయిర్ కూలర్‌లో కూలింగ్ ప్యాడ్‌లు చాలా ముఖ్యమైన భాగాలు. వాటిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి గాలిని చల్లబరచడంలో సహాయపడతాయి. ప్యాడ్లను తీసివేసి శుభ్రమైన నీటితో క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ప్యాడ్లు చాలా మురికిగా లేదా బూజు పట్టినట్లయితే వాటిని భర్తీ చేయాలి. రెగ్యులర్ క్లీనింగ్ ప్యాడ్‌ల పని సామర్థ్యాన్ని పెంచుతుంది, గాలిని చల్లగా ఉంచడం సులభతరం చేస్తుంది.
వాటర్ పంప్ అనేది ఎయిర్ కూలర్‌లో మరొక ముఖ్యమైన భాగం. ఇది ప్యాడ్‌లకు నీటిని సరఫరా చేస్తుంది. క్రమం తప్పకుండా పంపును చెక్ చేయాలి. అది సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి. పంపులో ఏదైనా అడ్డంకి వస్తే దాన్ని సరిచేయాలి. పంప్‌లో ఏదైనా లోపం ఉంటే వెంటనే దాన్ని భర్తీ చేయాలి. ఎయిర్ కూలర్ బయట కూడా క్లీన్గా ఉండాలి. కూలర్ బయటి భాగాలను తడి గుడ్డతో తుడవాలి. దీనివల్ల దుమ్ము, ధూళి తొలగిపోయి కూలర్ కొత్తగా కనిపిస్తుంది. వెలుపలి భాగాన్ని శుభ్రపరిచేటప్పుడు నీరు కూలర్ ఇతర భాగాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది. ఐరన్ కూలర్ తుప్పుపడితే దానికి రంగులు వేయాలి.