BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఉచితంగా 500 ఛానెల్స్‌ను వీక్షించేలా...

BSNL: ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎనల్‌ దూకుడుపెంచింది.

Update: 2024-12-05 11:17 GMT

BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఉచితంగా 500 ఛానెల్స్‌ను వీక్షించేలా...

BSNL: ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎనల్‌ దూకుడుపెంచింది. తక్కువ ధరలో మంచి మంచి బెనిఫిట్స్‌తో కూడిన రీ ఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తూ ప్రైవేట్‌ టెలికం సంస్థలకు గట్టి పోటీనిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా బ్రాడ్‌బ్యాండ్ ఆధారిత డిజిటల్‌ టీవీ సేవలను అందిస్తోంది. ఐఎఫ్‌టీవీ పేరుతో ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో ఈ సేవలు ప్రారంభం కాగా తాజాగా పంజాబ్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ స్క్రైప్‌తో ఒప్పందం చేసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ వినియోగదారులు 500 కంటే ఎక్కువ లైవ్‌ టీవీ ఛానెల్స్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. అన్ని ఛానెల్స్‌ను హెచ్‌డీ క్వాలిటీతో వీక్షించవచ్చు. దీంతో పాటు అదనంగా వినియోగదారులు 20 కంటే ఎక్కువ OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా పొందొచ్చు.

ఇక Skypro విషయానికొస్తే ఇది ఒక ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్‌ను అందిస్తోంది. పంజాబ్‌లో ఈ సేవలను తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి ప్రారంభించారు. ముందుగా, చండీగఢ్‌లోని 8,000 మంది BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సేవలతో వినియోగదారులు సెటప్‌ బాక్స్‌ లేకుండానే టీవీని వీక్షించవచ్చు. అలాగే SonyLIV, Zee5, Disney+ Hotstar వంటి 20కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఉచితంగా యాక్సెస్ పొందొచ్చు. ఈ సేవలను పొందడానికి స్మార్ట్‌ టీవీలో స్క్రైపో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. అదే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌కు కనెక్ట్‌ అయితే సరిపోతుంది కంటెంట్‌ వీక్షించవచ్చు. ఇలా యూజర్లను ఆకట్టుకునే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌ రోజురోజుకీ తన దూకుడును పెంచుతోంది.

Tags:    

Similar News