BSNL: దూసుకెళ్తున్న BSNL.. రూ.5కే 365 రోజుల కాలింగ్, డేటా..
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులకు రోజుకు రూ. 5 మాత్రమే ఖర్చు చేయడం ద్వారా 365 రోజుల పాటు 600GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. BSNL ఈ రీఛార్జ్ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు చౌకగా రీఛార్జ్ చేయడం ద్వారా BSNL సేవలను పొందాలనుకుంటే ఆఫర్‌కు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
నివేదికల ప్రకారం BSNL తన వినియోగదారులకు రూ. 1,999 ప్లాన్‌పై రూ. 100 డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఒక సంవత్సరం రీఛార్జ్ రూ. 1899కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందించాయి. BSNL ఈ ఆఫర్ ముఖ్యంగా వార్తల్లో ఉంది ఎందుకంటే జియో, ఎయిర్టెల్, వీఐలు జూలైలో టారిఫ్‌లను పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను పొందింది.
BSNL ఆఫర్‌లో రూ. 1899 రీఛార్జ్‌పై కస్టమర్‌లు 600GB డేటా, అన్‌లమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందుతారు. BSNL ఈ ఆఫర్‌ని ఒక పోస్ట్‌లో షేర్ చేసింది. రూ. 1999 విలువైన రీఛార్జ్ వోచర్ ఇప్పుడు రూ.1899కి మాత్రమే. ఏడాది పొడవునా 600GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, గేమ్‌లు, మ్యూజిక్ మరెన్నో. ఈ ఆఫర్ 7 నవంబర్ 2024 వరకు వాలిడిటీతో ఉంటుంది.
BSNL తన D2D (డివైస్-టు-డివైస్) సర్వీస్ Viasat సహకారంతో విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ కింద, కస్టమర్‌లు సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ నుండి నేరుగా ఆడియో, వీడియో కాల్‌లు చేయగలరు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో నిర్వహించిన పరీక్షలో, BSNL 36,000 కిలోమీటర్ల దూరం నుండి శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి విజయవంతంగా కాల్ చేసింది. ఈ సర్వీస్ అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.