BSNL 5G: BSNL 5G..స్పీడ్ పెంచిన ప్రభుత్వం.. లాంచ్ ఎప్పుడంటే..?
BSNL 5G: 4G కోసం ఎదురుచూస్తున్న BSNL యూజర్లు త్వరలో 5G సర్వీస్ బహుమతిని పొందబోతున్నారు.
BSNL 5G: 4G కోసం ఎదురుచూస్తున్న BSNL యూజర్లు త్వరలో 5G సర్వీస్ బహుమతిని పొందబోతున్నారు. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 5G సర్వీస్ ప్రారంభ తేదీని వెల్లడించారు. అక్టోబర్ 14 సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో BSNL 5G సేవ కోసం సన్నాహాలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ టెలికాం కంపెనీ దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేస్తోంది.
వచ్చే ఏడాది జూన్ 2025 నాటికి కంపెనీ 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించగలదని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ ఐటియుడబ్ల్యుటిఎస్‌ఎలో ఆయన మాట్లాడుతూ భారతదేశం 4జిలో ప్రపంచాన్ని అనుసరిస్తోందని, 5జిలో ప్రపంచానికి ధీటుగా నిలుస్తోందని, 6జి టెక్నాలజీలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు.
ప్రభుత్వ సంస్థ వేరొకరి పరికరాలను ఉపయోగించదని ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెబుతున్నారని టెలికాం మంత్రి తెలిపారు. "మేము ఇప్పుడు ఒక కోర్, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ని కలిగి ఉన్నాము. ఇది పూర్తిగా పని చేస్తుంది" అని సింధియా చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నాటికి లక్ష సైట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మేము నిన్నటి వరకు 38,300 సైట్‌లను ప్రారంభించాము.
అతను ఇంకా మాట్లాడుతూ మేము మా స్వంత 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నాము. ఇది జూన్ 2025 నాటికి 5Gకి మారుతుంది. అలా చేస్తే ప్రపంచంలోనే ఆరో దేశంగా నిలుస్తాం.'' ప్రభుత్వ సంస్థ BSNL, C-DOT, దేశీయ ఐటీ కంపెనీ TCS సహకారంతో అభివృద్ధి చేసిన 4G టెక్నాలజీని ఉపయోగిస్తోంది. 22 నెలల్లో 4.5 లక్షల టవర్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ టెక్నాలజీని భారత్ అమలు చేసిందని, దేశ జనాభాలో 80 శాతం మందికి ఈ సేవ అందుబాటులో ఉందని సింధియా చెప్పారు.
4G/5G సేవ కోసం BSNL 1 లక్ష కొత్త టవర్లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. వీటిలో 75 వేల టవర్లను ఈ సంవత్సరం చివరి నాటికి ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.