Budget Electric Scooters: తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Budget Electric Scooters: నేటి రోజుల్లో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు.

Update: 2023-08-15 11:40 GMT

Budget Electric Scooters: తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Budget Electric Scooters: నేటి రోజుల్లో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వీటి వల్ల తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. మెయింటనెన్స్ ఖర్చుకూడా తక్కువగానే ఉంటుంది. అయితే మార్కెట్‌లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలని ప్రవేశపెట్టాయి. వీటిలో సామాన్యుడి బడ్జెట్‌లో వచ్చే కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67190 నుంచి రూ. 85190 రూపాయల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

ఒకినావా ప్రైజ్ ప్రో

ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా ప్రైజ్ ప్రో కూడా మార్కెట్లో బాగా అమ్ముడవుతుంది. ఒకినావా ప్రైజ్ ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ.99645. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 58 కి.మీ.

ఒకాయ ఫాస్ట్ F2B

ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya F2B ఎక్స్-షోరూమ్ ధర రూ.99950. ఇందులో 6 కలర్ ఆప్షన్‌లను పొందుతారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

లెక్ట్రిక్స్ EV LXS

ఎలక్ట్రిక్ స్కూటర్ Lectrix EV LXS ఎక్స్-షోరూమ్ ధర రూ.91253. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లెక్ట్రిక్స్ EV LXS గరిష్టంగా 50 kmph వేగంతో వెళుతుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుంది.

Tags:    

Similar News