iPhone Offers: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. రూ.35 వేలకే ఐఫోన్.. ఛాన్స్ మళ్లీ రాదు..!

iPhone Offers: ఆపిల్ ఐఫోన్ 13పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ. 35,900కి ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-14 08:52 GMT

iPhone Offers

iPhone Offers: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ మార్కెట్‌లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. మనలో చాలా మంది ఐఫోన్‌ను ఒక్కసారైన వాడాలని అనుకుంటారు. అయితే ధరలు చూసి వెనుకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం ఆపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 13పై భారీ ఆఫర్ ప్రకటించింది.

ఆపిల్ ఐఫోన్ 13పై బెస్ట్ డీల్‌ను తీసుకొచ్చింది. ఈ డీల్‌ను ఇండియా iStore‌లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రూ. 35,900 ధరతో ఫోన్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆపిల్ అఫిషియల్ రిటైల్ స్టోర్‌లలో లభిస్తుంది. ఐఫోన్ 13128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.59,600కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 13 ధరను తగ్గించే ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ రూ. 4,700, రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఐఫోన్ 13ని రూ. 35,900కి ఎలా కొనుగోలు చేయాలి అనే అతిపెద్ద ప్రశ్న మొబైల్ లవర్స్‌లో ఎదురవుతుంది. ఎందుకంటే ఈ ఆఫర్ పొందడానికి మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాలి. 64 GB iPhone 11పై రూ. 13,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. అలానే రూ. 5,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో iPhone 13 ధర రూ. 35,900కి తగ్గుతుంది. మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ ఫోన్ ధర మారుతుంది.

మీరు రూ. 3,000 నుండి రూ. 10,000 మధ్య విలువైన ఏదైనా ఇతర స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తుంటే, స్టోర్ రూ. 3,000 అదనపు బోనస్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ విలువ రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్య ఉంటే స్టోర్‌లు రూ. 5,000 అదనపు తగ్గింపును ఇస్తాయి. అదే సమయంలో మీరు రూ. 15,000 కంటే ఎక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే స్టోర్ ఐఫోన్ 13పై రూ. 8,000 డిస్కౌంట్ అందిస్తుంది.

ఐఫోన్ 13 కాల్‌లు చేయడానికి, సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించడానికి, ఫోటోలు తీయడానికి, గేమ్‌లు ఆడేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. డిజైన్, ఫీచర్ల పరంగా ఇది ఐఫోన్ 14 లానే ఉంటుంది. అయితే, iPhone 15తో పోలిస్తే, iPhone 13లో USB-C ఛార్జింగ్, డైనమిక్ ఐలాండ్, 48 MP కెమెరా లేనందున అది కాస్త పాతదిగా కనిపిస్తుంది.

Tags:    

Similar News