Amazon Prime Subscription: కేవలం రూ. 67తో ప్రైమ్ వీడియో.. ఎంజాయ్ చేసేయండి..!
Amazon Prime Subscription: ఓటీటీ ప్రియుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్త వెబ్ సిరీస్‌లు , సినిమాలు విడుదల అవుతున్నాయి.
Amazon Prime Subscription: ఓటీటీ ప్రియుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్త వెబ్ సిరీస్‌లు , సినిమాలు విడుదల అవుతున్నాయి. మీరు కూడా అమెజాన్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. తక్కువ ధరలో ఎలా కొనుగోలు చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెలకు కేవలం రూ. 67 ఖర్చు చేయడం ద్వారా తాజా వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు ఎలా ఆస్వాదించగలరో తెలుసుకుందాం.
అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం ప్లాన్ ధర రూ. 1499, అయితే కంపెనీ తన కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర కేవలం రూ. 799 మాత్రమే. ఈ ప్లాన్ పేరు అమెజాన్ ప్రైమ్ లైట్. రూ. 799 ఆధారంగా, ఈ ప్లాన్ నెలవారీ ఖర్చు రూ. 66.58 (సుమారు రూ. 67).
అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు?
అమెజాన్ అధికారిక సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వీడియో లైట్ మెంబర్ షిప్ కొనుగోలు చేస్తే, మీరు 799 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ ధర వద్ద మీరు ఒక సంవత్సరం వార్షిక ప్లాన్ పొందుతారు. ప్రైమ్ వీడియోకి యాక్సెస్ పొందడమే కాకుండా, ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు వేగంగా ఒక రోజు లేదా రెండు రోజుల డెలివరీ ప్రయోజనం పొందుతారు.
ఈ ప్లాన్‌లో వినియోగదారులు HDలో వీడియో కంటెంట్‌ను లేదా ప్రకటనలతో 720 పిక్సెల్ రిజల్యూషన్‌ను పొందుతారు. వినియోగదారులు ఒకే పరికరంలో మాత్రమే ఖాతాను యాక్సెస్ చేయగలరు. మరోవైపు, రూ. 1499 ప్లాన్‌లో, 4K రిజల్యూషన్ వరకు వీడియో కాలింగ్ , అడ్వర్ టైజ్ మెంట్ లేకుండా అందుబాటులో ఉంది. లైట్ మెంబర్‌షిప్‌తో, వినియోగదారులు యాడ్-ఫ్రీ మ్యూజిక్ కోసం అమెజాన్ మ్యూజిక్, ఉచిత ఇ-బుక్స్ కోసం ప్రైమ్ రీడింగ్ ప్రయోజనాలను పొందలేరు. మొత్తంమీద, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ప్రైమ్ వీడియో అన్ని వెబ్ సిరీస్‌లు , సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ లైట్ సరైనది.